Brundha: చోరీ సొత్తును కాజేసిన మహిళా ఇన్ స్పెక్టర్.. ట్రాన్స్ ఫర్ చేసిన అధికారులు

Woman Inspector Transferred for Stealing Recovered Goods
  • దొంగ నుంచి రికవరీ చేసినా లెక్కల్లో చూపని ఎస్ఐ
  • రూ.75 వేలు తిరిగివ్వలేదని బాధితురాలి ఆరోపణ
  • అంతర్గత విచారణలో బయటపడ్డ ఎస్ఐ చేతివాటం
దొంగను పట్టుకుని చోరీ చేసిన సొత్తును రికవరీ చేసిన ఓ మహిళా ఇన్ స్పెక్టర్.. అందులో కొంత మొత్తాన్ని కాజేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ఉన్నతాధికారులు విచారణ జరిపించగా ఎస్ఐ చేతివాటం నిజమేనని తేలింది. దీంతో ఆ ఎస్ఐపై బదిలీ వేటు వేశారు. తమిళనాడులోని వేలాచ్చేరిలో చోటుచేసుకుందీ ఘటన. వివరాల్లోకి వెళితే.. కడలూర్‌ జిల్లా కొరక్కావడి గ్రామానికి చెందిన అమ్మణియమ్మాళ్‌(60) ఉపాధి హామీ పనికి వెళుతుండగా ఓ వ్యక్తి ఆమెను అడ్డగించాడు.

కత్తితో బెదిరించి అమ్మణియమ్మాళ్ ఒంటిపై ఉన్న 3 సవర్ల బంగారు నగలు, రూ.75 వేల నగదును ఎత్తుకెళ్లాడు. అమ్మణియమ్మాళ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న వేళాచ్చేరి పోలీసులు.. దొంగను అరెస్టు చేసి నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే, రికవరీ చేసిన సొమ్ములో రూ.75 వేలను మహిళా ఇన్ స్పెక్టర్ బృంద లెక్కల్లో చూపలేదు. దీనిపై అమ్మణియమ్మాళ్ ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో వారు అంతర్గత విచారణ జరిపించారు. ఇన్ స్పెక్టర్ బృంద ఆ సొమ్ము కాజేసిందని తేలడంతో ఆమెను సాయుధ పోలీస్‌ దళానికి బదిలీపై పంపించినట్లు ఎస్పీ జయకుమార్‌ తెలిపారు.
Brundha
Tamil Nadu
Theft
Woman Inspector
Police
Corruption
Vellacheri
Crime
Money Laundering

More Telugu News