Priyanka Mohan: ప్రియాంక కెరియర్ ఇక్కడ మలుపు తిరగాలి మరి!

Priyanka Mohan Special
  • తెలుగులోను ప్రియాంకకి క్రేజ్ 
  • తమిళంలో ఉన్న సక్సెస్ లు 
  • ఈ నెల 25న విడుదల కానున్న 'OG'
  • ప్రియాంకకి కలిసొచ్చినట్టేననే టాక్  
  • బ్లాక్ బస్టర్ ఖాయమంటున్న ఫ్యాన్స్ 

ప్రియాంక మోహన్ .. నాజూకు సౌందర్యానికి నచ్చిన పేరు. చక్కని కనుముక్కు తీరుతో .. పొందికైన రూపంతో ఆకట్టునే ఆకర్షణకు ఆనవాలు ప్రియాంక మోహన్. అలాంటి ఈ సుందరి కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ, తమిళ .. తెలుగు సినిమాలతోనే తన కెరియర్ ను కొనసాగిస్తూ వెళుతోంది. నిదానంగానే అయినా స్టార్ హీరోలతోనే సినిమాలను ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళుతోంది. విశాలమైన కళ్లతో ఈ బ్యూటీ చేసే విన్యాసాలకు అభిమానులుగా మారిపోయిన కుర్రాళ్లు పెద్దసంఖ్యలోనే ఉన్నారు. 

తెలుగులో నాని సరసన ప్రియాంక చేసిన 'నానీస్ గ్యాంగ్ లీడర్' .. 'సరిపోదా శనివారం' ఫరవాలేదనిపించాయి. అలాగే తమిళంలో శివకార్తికేయన్ తో చేసిన సినిమాలు ఆమె క్రేజ్ ను పెంచాయి. అలాంటి ప్రియాంక ఊహించని విధంగా పవన్ కల్యాణ్ 'OG' సినిమాలో ఛాన్స్ కొట్టేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. టాలీవుడ్ వైపు నుంచి ఆమెకి దక్కిన పెద్ద ఛాన్స్ ఇదేనని చెప్పాలి. 250 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, బ్లాక్ బస్టర్ కావడం ఖాయమనేది ఫ్యాన్స్ మాట. 

డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 25వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో పవన్ మాటలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ స్టేజ్ పై ప్రియాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టాలీవుడ్ వైపు నుంచి ఆమె కెరియర్ మలుపు తిరిగితే ఇప్పుడే తిరగాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ అవకాశం .. అదృష్టం ఎంతవరకూ ఆమెకి కలిసొస్తాయనేది చూడాలి మరి.
Priyanka Mohan
Pawan Kalyan OG
OG Movie
Telugu Cinema
Tollywood
DVV Danayya
Thaman
Sarippodaa Sanivaaram
Nani's Gang Leader

More Telugu News