ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నేడు వ్యవసాయ రంగంపై కీలక ప్రకటన
- ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు
- పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- వ్యవసాయ రంగంపై కీలక ప్రకటన చేయనున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాల అనంతరం పలు కీలక బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లు, అబ్కారీ చట్ట సవరణ బిల్లు, ఇతర నోటిఫికేషన్లు, వార్షిక నివేదికలు సభ ముందుకు రానున్నాయి.
ప్రవేశపెట్టనున్న ముఖ్య బిల్లులు:
మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయులు ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర అబ్కారీ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఏపీ పర్యావరణ నిర్వహణ సంస్థ, హస్తకళల అభివృద్ధి సంస్థ, గృహ నిర్మాణ సంస్థ వార్షిక నివేదికలు, అత్యవసర నిర్వహణ చట్టం నోటిఫికేషన్, బీమా వైద్య సేవల నోటిఫికేషన్, కార్మిక-కర్మాగారాల నోటిఫికేషన్, అల్ప సంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ వార్షిక నివేదిక సభలో ప్రవేశపెట్టనున్నారు.
వ్యవసాయ రంగంపై లఘు చర్చ
వ్యవసాయ రంగంపై లఘు చర్చ జరగనుండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేయనున్నారు. కాగా, మరోవైపు జీఎస్టీ సంస్కరణలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మండలిలో ప్రకటన చేయనున్నారు.