Chandrababu Naidu: విశాఖకు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

AP CM Chandrababu Reaches Visakhapatnam
  • రెండు రోజుల పాటు నిర్వహించే జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
  • విశాఖ నుంచి అమరావతికి మధ్యాహ్నం తిరుగు ప్రయాణం
  • శాసనసభలో వ్యవసాయ రంగంపై నిర్వహించే లఘు చర్చలో ప్రసంగించనున్న సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖలో రెండు రోజుల పాటు జరగనున్న జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సును ఆయన కొద్దిసేపట్లో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఉదయం 8 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి విశాఖ నగరంలోని కోస్టల్ బ్యాటరీ వద్ద ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.

నోవాటెల్ హోటల్‌లో ఈ-గవర్నెన్స్‌కు సంబంధించిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన అనంతరం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సదస్సులో పాల్గొంటారు. ఆ తర్వాత విశాఖ నుంచి మధ్యాహ్నానికి అమరావతికి తిరిగి చేరుకుంటారు. అనంతరం శాసనసభలో వ్యవసాయ రంగంపై నిర్వహించే లఘు చర్చలో పాల్గొని ప్రసంగిస్తారు. 
Chandrababu Naidu
AP CM
Andhra Pradesh
Visakhapatnam
National e-Governance Conference
e-Governance Summit
Amaravati
Coastal Battery
Novotel Hotel

More Telugu News