Kalikrishna Ashram: అన్ని చోట్లా నవరాత్రులు.. ఇక్కడ అమ్మవారికి ఒక్కరోజే పూజలు!

Kalikrishna Ashram Navaratri Celebrations Held for Only One Day
  • బెంగాల్ ఆసన్ సోల్ లోని ధేనువా గ్రామంలో ఒక్క రోజే దసరా శరన్నవరాత్రి పూజలు
  • 1979 నుంచి మహాలయ అమావాస్య రోజే దుర్గా విగ్రహానికి సప్తమి, అష్టమి, నవమి, దశమి పూజలు
  • పూజల అనంతరం నవపత్రికలకు నిమజ్జనం  
  • దసరా వేడుకలకు ధేనువాతో పాటు సమీప గ్రామాలు, బంకుడా, పురులియా వంటి జిల్లాల నుంచి వేలాదిగా తరలిరానున్న భక్తులు
దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. అయితే, పశ్చిమ బెంగాల్‌లోని ధేనువా గ్రామంలో మాత్రం ఈ వేడుకలు ఒక్క రోజులోనే ముగుస్తాయి. ధేనువా గ్రామంలోని కాళీకృష్ణ ఆశ్రమంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవ పూజలు ఒక్కరోజు మాత్రమే నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇది ఒక అరుదైన సంప్రదాయం.

ఈ ఆసక్తికర సంప్రదాయం 1937లో ప్రారంభమైంది. ధేనువా గ్రామంలో తేజానంద బ్రహ్మచారి అనే సన్యాసి దామోదర్ నది తీరాన కాళీకృష్ణ ఆశ్రమాన్ని స్థాపించారు. అనంతరం, 1979లో అమ్మవారు ఆయనకు కలలో దర్శనమిచ్చారట. అప్పటి నుంచి మహాలయ అమావాస్య నాడే అమ్మవారికి సంబంధించిన సప్తమి, అష్టమి, నవమి, దశమి పూజలు అన్నింటినీ ఒక్కరోజులోనే నిర్వహించే సంప్రదాయం ప్రారంభమైంది.

పూజల సందర్భంగా తొమ్మిది రకాల పవిత్ర పత్రాలతో తయారైన నవపత్రికను జలాభిషేకం చేసి, అమ్మవారి విగ్రహం ముందు ఉంచుతారు. ప్రత్యేకంగా జయ, విజయలతో కూడిన అమ్మవారి విగ్రహం మాత్రమే ఇక్కడ ప్రతిష్ఠించబడుతుంది. పూజలు పూర్తయిన తర్వాత, నవపత్రికను నదిలో నిమజ్జనం చేస్తారు. అయితే, విగ్రహం మాత్రం భక్తుల దర్శనార్థం అక్కడే ఉంచుతారు, కానీ ఎలాంటి పూజలు నిర్వహించరు.

ఈ ప్రత్యేక ఉత్సవాన్ని చూడటానికి బంకుడా, పురులియా జిల్లాలతో పాటు ధేనువా గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. 
Kalikrishna Ashram
Dhenua
Dussehra
Navaratri
West Bengal
Tejananda Brahmachari
Hindu festival
Indian traditions
Bengal culture

More Telugu News