Viral Video: తాగి బడికొచ్చిన హెచ్‌ఎం.. విచారణకు వచ్చిన అధికారిపైనే బూతుల వర్షం.. ఇదిగో వీడియో

Drunk headmaster abuses officer investigating complaint in Vizianagaram
  • విజయనగరంలో ప్రధానోపాధ్యాయుడి నిర్వాకం
  • ఫుల్లుగా తాగి పాఠశాలకు వచ్చిన హెచ్‌ఎం
  • ఫిర్యాదులపై విచారణకు వెళ్లిన డిప్యూటీ డీఈఓ
  • విచార‌ణ‌కు వ‌చ్చిన అధికారిపైనే అసభ్య పదజాలంతో దూషణలు
  • సోషల్ మీడియాలో వైరలైన ఘటన వీడియో
సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు, తాను పనిచేసే బడిలోనే మద్యం మత్తులో హల్‌చల్ చేశాడు. విచారణ కోసం వచ్చిన ఉన్నతాధికారిపైనే బూతుల వర్షం కురిపించి అందరినీ విస్మయపరిచాడు. ఈ షాకింగ్‌ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... మెంటాడ మండలం కుంటినవలస హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు గత కొంతకాలంగా మద్యం సేవించి విధులకు హాజరవుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టేందుకు డిప్యూటీ డీఈఓ స్వయంగా పాఠశాలకు వెళ్లారు.

అయితే, అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆ ప్రధానోపాధ్యాయుడు, అధికారిని చూసి సహనం కోల్పోయాడు. విచారణకు సహకరించకపోగా, ఆయన ముందే అసభ్య పదజాలంతో దూషణలకు దిగాడు. ఈ దృశ్యాలను అక్కడున్న వారు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో ఈ ఘటన విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.

ఈ వీడియో ఆధారంగా సదరు ప్రధానోపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పవిత్రమైన బడిలోనే గురువు ఇలా ప్రవర్తించడంపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Viral Video
Headmaster
Headmaster drunk
Andhra Pradesh headmaster
Vizianagaram
Kuntinavalasa High School
Deputy DEO
School teacher drunk
Teacher abuse
Education department

More Telugu News