YS Jagan: 'జగన్ బాధ్యతారాహిత్యం' అంటూ తులసి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

YS Jagan Irresponsible Remarks by Tulasi Reddy
  • ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయాలన్న తులసిరెడ్డి
  • ప్రతిపక్ష హోదా లేకపోవడాన్ని కారణంగా చూపించడం హాస్యాస్పదమని వ్యాఖ్య
  • జనార్దన్ రెడ్డి వంటి నేతలు సభకు వెళ్లి పోరాటం చేశారన్న తులసిరెడ్డి
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి శాసనసభకు గైర్హాజరు కావడంపై కడప జిల్లా వేంపల్లెలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీకి హాజరు కాకుండా ప్రజా సమస్యలపై మౌనం పాటిస్తున్న వైఎస్ జగన్ తన బాధ్యతలను విస్మరించారని, కనీసం నియోజకవర్గ ప్రతినిధిగా అయినా ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

జగన్ అసెంబ్లీకి రాలేకపోవడానికి ప్రతిపక్ష హోదా లేకపోవడాన్ని కారణంగా చూపించడం హాస్యాస్పదమని తులసిరెడ్డి విమర్శించారు. ‘‘తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలనీ, ఎక్కువసేపు మాట్లాడేందుకు మైకు ఇవ్వాలనీ, అప్పుడే సభకు వస్తాననడం చిన్నపిల్లల చేష్టలతో సమానం. ప్రజల పక్షాన మాట్లాడే బాధ్యతను మరచిపోతే, జగన్‌ లో బాధ్యత అనే భావన ఎంత అపరిపక్వంగా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని ఎద్దేవా చేశారు.

1994లో కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా దక్కని సందర్భాన్ని గుర్తు  చేస్తూ.. అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై చర్చించారని తులసిరెడ్డి తెలిపారు. అప్పుడు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ జనార్దన్ రెడ్డి వంటి నేతలు సభకు వెళ్లి పోరాటం చేయగా, జగన్ సభకు కూడా వెళ్లకుండా ఉండిపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.

‘‘నేను పులివెందుల నియోజకవర్గ ఓటరుని. మా ప్రాతినిధ్యం నిలబెట్టే నేత సభలోనే కనిపించకపోతే, పదవికి రాజీనామా చేయడం సముచితమని డిమాండ్ చేస్తున్నా’’ అని తులసిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల మద్దతుతో గెలిచిన నేతలు, సభల దరిదాపుల్లోకి రాకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. 
YS Jagan
Jagan Mohan Reddy
Tulasi Reddy
Andhra Pradesh Congress Committee
APCC
VemPalli
Kadapa district
AP Assembly
Opposition leader
Janardhan Reddy

More Telugu News