Chikkiri Mallesh: న్యూడ్ వీడియోలతో వల.. రెండేళ్లలో రూ.3.80 కోట్లు కొట్టేశారు!

Kurnool man loses 38 million in online sextortion fraud Telangana gang arrested
  • న్యూడ్ వీడియోలు, అసభ్యకర కాల్స్‌తో హనీట్రాప్
  • 'సంయుక్త రెడ్డి' పేరుతో నకిలీ ట్విట్టర్ ఖాతా
  • తక్కువ ధరకే స్థలాలంటూ నమ్మించిన ముఠా
  • భార్యాభర్తలతో పాటు మరో మహిళ అరెస్ట్
  • డబ్బుతో కార్లు, బంగారం కొనుగోలు చేసిన నిందితులు
సోషల్ మీడియా ద్వారా పరిచయమైన మహిళల వలలో చిక్కి కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.3.80 కోట్లు పోగొట్టుకున్నాడు. నగ్న వీడియోలు, అసభ్యకరమైన మాటలతో నమ్మించి, రెండేళ్ల పాటు విడతల వారీగా ఈ భారీ మొత్తాన్ని వసూలు చేసిన తెలంగాణకు చెందిన ముగ్గురు సభ్యుల ముఠాను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన చిక్కిరి మల్లేశ్, అతడి భార్య పెరుమాళ్ల మేరీ, వారి సన్నిహితురాలు మొల్లం మల్లిక అలియాస్ లిల్లీ కలిసి సులభంగా డబ్బు సంపాదించాలని పథకం పన్నారు. ఇందుకోసం 'సంయుక్త రెడ్డి' అనే పేరుతో ఓ నకిలీ ట్విట్టర్ ఖాతా సృష్టించారు. ఈ ఖాతా ద్వారా కర్నూలుకు చెందిన వ్యక్తిని పరిచయం చేసుకున్నారు. అతడి నమ్మకాన్ని చూరగొనేందుకు ముందుగా న్యూడ్ వీడియోలు పంపి, ఆ తర్వాత ఓ మహిళతో అసభ్యకరంగా వాట్సాప్ వీడియో కాల్ చేయించి రెచ్చగొట్టారు.

అంతటితో ఆగకుండా, తక్కువ ధరకే పొలాలు, స్థలాలు ఇప్పిస్తామంటూ కట్టుకథలు అల్లి పూర్తిగా నమ్మించారు. వారి మాటలు నిజమని భావించిన బాధితుడు, సుమారు రెండేళ్ల కాలంలో పలు దఫాలుగా మొత్తం రూ.3.80 కోట్లను వారి ఖాతాలకు బదిలీ చేశాడు. ఈ డబ్బుతో నిందితులు రూ.41.26 లక్షలు వెచ్చించి రెండు కార్లు, ఓ బైక్, బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. మిగిలిన రూ.3.38 కోట్లను విలాసవంతమైన జీవితానికి, ఇతర ఖర్చులకు వాడేశారు.

చివరకు తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న కర్నూలు రెండో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితులు ముగ్గురినీ అరెస్టు చేసినట్లు సీఐ నాగరాజారావు శుక్రవారం మీడియాకు తెలిపారు.
Chikkiri Mallesh
Kurnool
cyber crime
online fraud
sextortion
Nagarkurnool
Telangana
Twitter
WhatsApp video call
financial fraud

More Telugu News