Tenali Police: డ్రోన్ సాయంతో పేకాటరాయుళ్లను పట్టుకున్న తెనాలి పోలీసులు

Tenali Police Apprehend Gamblers with Drone Assistance
  • డ్రోన్ సాయంతో పేకాట శిబిరాన్ని గుర్తించిన పోలీసులు
  • సంగం జాగర్లమూడిలో చోటుచేసుకున్న ఘటన
  • 12 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
డ్రోన్ సాయంతో పోలీసులు పేకాటరాయుళ్ల గుట్టురట్టు చేశారు. నేరాల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు.

తెనాలి రూరల్ మండలం, సంగంజాగర్లమూడి రైల్వే ట్రాక్ సమీపంలోని పొదల్లో కొందరు పేకాట ఆడుతున్నట్లు డ్రోన్ ద్వారా పోలీసులు గుర్తించారు. తక్షణమే పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేయగా, జూదరులు పరారయ్యేందుకు ప్రయత్నించారు.

వెంటాడిన పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకోగా, వారి నుంచి రూ. 1,62,000 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డ్రోన్ నిఘా కారణంగా పేకాటరాయుళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 
Tenali Police
Tenali
Andhra Pradesh Police
Drone Surveillance
Gambling
Sanganjagarlamudi
Illegal Gambling
Crime Control
AP Police

More Telugu News