Badam Singh: కూతురి కళ్లలో కారం చల్లి కత్తికి బలి చేశాడు!

Drunk father kills daughter in Gwalior Madhya Pradesh
  • మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణ ఘటన
  • కన్న కూతురిని కిరాతకంగా హత్య చేసిన తండ్రి
  • మొదట కళ్లలో కారం చల్లి, తర్వాత కత్తితో దాడి
  • మద్యం డబ్బుల కోసం తలెత్తిన గొడవే కారణం
  • తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడి
మధ్యప్రదేశ్‌లో కన్నతండ్రే కాలయముడైన దారుణ ఘటన వెలుగుచూసింది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి, డబ్బుల విషయంలో గొడవపడి కన్న కూతురినే అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ అమానవీయ సంఘటన గ్వాలియర్‌లోని బెల్దార్ కా పురా ప్రాంతంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది.

జనక్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న బదం సింగ్ కుష్వాహా అనే వ్యక్తికి మద్యపానం అలవాటు ఉంది. ఏ పనీ చేయకుండా ఇంట్లోనే ఉంటూ, కుటుంబానికి చెందిన కిరాణా దుకాణంలో డబ్బులు దొంగిలించి మద్యం తాగేవాడు. ఈ విషయమై అతని 24 ఏళ్ల కూతురు రాణి కుష్వాహా తరచూ తండ్రిని నిలదీసేది. గురువారం ఉదయం 9:30 గంటల సమయంలో కూడా మద్యం కోసం డబ్బులు తీసుకుంటున్న తండ్రిని రాణి అడ్డుకుంది.

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బదం సింగ్, మొదట రాణి కళ్లలో కారం పొడి చల్లాడు. ఆమె బాధతో విలవిల్లాడుతుండగా, కత్తితో విచక్షణారహితంగా ఐదుసార్లు పొడిచి దారుణంగా హత్య చేశాడు. రాణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇంట్లో నుంచి గట్టిగా అరుపులు వినపడటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితుడు బదం సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం, కుటుంబ కలహాలే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. "అతడిని ఎవరైనా ఎదిరిస్తే దుర్భాషలాడుతూ కొట్టేవాడు. రాణి అతడి తీరును ఎప్పుడూ వ్యతిరేకించేది" అని మృతురాలి తల్లి భగవతి బాయి కన్నీరుమున్నీరయ్యారు.

"నిందితుడు మద్యానికి బానిస. హత్యకు దారితీసిన పూర్తి కారణాలపై విచారణ జరుపుతున్నాం. తదుపరి చర్యలు తీసుకుంటాం" అని ఎస్పీ ధర్మవీర్ యాదవ్ మీడియాకు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
Badam Singh
Madhya Pradesh crime
Gwalior murder
daughter killed
crime news
alcohol addiction
family dispute
rani kushwaha
indian crime news
father arrested

More Telugu News