Nag Ashwin: నాగ్ అశ్విన్ ట్వీట్... దీపిక పదుకొణే గురించేనా?

Nag Ashwins Cryptic Post Amid Deepika Padukone Kalki Exit
  • కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరన్న నాగ్ అశ్విన్
  • జరిగిన దాన్ని మనం మార్చలేమని ట్వీట్
  • దీపికను ఉద్దేశించే అంటున్న నెటిజన్లు
కల్కి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు మరింత ఆసక్తి రేపుతోంది. ఈ వివాదంపై పరోక్షంగా స్పందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

‘కల్కి’ సినిమాలోని ఓ కీలక సన్నివేశానికి సంబంధించిన వీడియోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అందులో, ‘కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు, నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే’ అని కృష్ణుడు అశ్వత్థామతో చెప్పే డైలాగ్ ఉంది. దీనికి, ‘జరిగిన దాన్ని మనం మార్చలేం, కానీ తర్వాత ఏం జరగాలో మనమే నిర్ణయించుకోవచ్చు’ అనే వ్యాఖ్యను జోడించారు. ఈ పోస్ట్‌ను నాగ్ అశ్విన్ పరోక్షంగా దీపికను ఉద్దేశించే పెట్టారని నెటిజన్లు, సినీ వర్గాలు భావిస్తున్నాయి.

‘కల్కి’ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిన్న ఓ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. సినిమా సీక్వెల్ నుంచి దీపికా పదుకొణెను తొలగిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఒక ప్రాజెక్ట్‌కు పూర్తిస్థాయి నిబద్ధత అవసరమని, ఆ విషయంలో దీపికతో కొనసాగలేకపోతున్నామని వారు తమ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, అసలు కారణాలను మాత్రం స్పష్టం చేయలేదు.

అయితే, ఈ నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. రెమ్యునరేషన్ పెంచాలని, రోజుకు ఏడు గంటలు మాత్రమే పనిచేస్తానని, తనతో పాటు వచ్చే 25 మంది సిబ్బందికి ఫైవ్ స్టార్ వసతులు కల్పించాలని దీపిక డిమాండ్ చేసినట్లు కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ ఆరోపణలపై దీపికా పదుకొణె గానీ, ఆమె ప్రతినిధులు గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ మొత్తం వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారగా, నాగ్ అశ్విన్ పోస్ట్ ఈ చర్చకు మరింత ఆజ్యం పోసినట్లయింది. 
Nag Ashwin
Deepika Padukone
Kalki 2898 AD
Vyjayanthi Movies
Kalki movie
Telugu cinema
Indian cinema
Deepika Padukone controversy
Nag Ashwin tweet
Movie sequel

More Telugu News