Marri Rajasekhar: వైసీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ.. టీడీపీ గూటికి మాజీ ఎమ్మెల్సీ మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌

Marri Rajasekhar to Join TDP After Quitting YSRCP
  • నేడు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిక
  • ఇప్పటికే పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా
  • చిలకలూరిపేటకు చెందిన కీలక నేతగా గుర్తింపు
  • ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా టీడీపీలోకి
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వైసీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత, చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఈ చేరిక కార్యక్రమం అమరావతిలో జరగనుంది. మర్రి రాజశేఖర్‌తో పాటు ఆయన అనుచరులు, పలువురు స్థానిక వైసీపీ నేతలు కూడా టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇటీవలే తన ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే ఆయన పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైన తర్వాత ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. పార్టీ ఓటమికి గల కారణాలు, అధినేత వైఎస్ జగన్ వ్యవహారశైలిపై అసంతృప్తితో పలువురు కీలక నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. తమ పదవులకు సైతం రాజీనామాలు చేసి బయటకు వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మర్రి రాజశేఖర్ కూడా వైసీపీని వీడి, టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద లోటుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Marri Rajasekhar
YSRCP
TDP
Chilakaluripeta
Chandrababu Naidu
Andhra Pradesh Politics
Political defections
Telugu Desam Party
AP Assembly Elections 2024
YS Jagan

More Telugu News