iPhone 17: ఐఫోన్ 17 కోసం ఎగబడ్డ జనం.. ముంబై యాపిల్ స్టోర్ వద్ద తోపులాట, పిడిగుద్దులు.. వీడియో ఇదిగో!
- ముంబై యాపిల్ స్టోర్ వద్ద తీవ్ర గందరగోళం
- కొత్త ఐఫోన్ 17 కోసం కొట్టుకున్న వినియోగదారులు
- క్యూ దాటేందుకు ప్రయత్నించడమే కారణం
- భద్రతా వైఫల్యమేనని కొనుగోలుదారుల ఆరోపణ
- ఢిల్లీ, బెంగళూరు స్టోర్ల వద్ద కూడా భారీ క్యూలు
- ఉదయం 5 గంటల నుంచే వేచి ఉన్న జనం
కొత్త ఐఫోన్ 17 సిరీస్ కోసం జనం ఎంతగా ఎగబడుతున్నారంటే.. ఒకరినొకరు కొట్టుకునేంతగా! ముంబైలోని యాపిల్ స్టోర్ వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనే ఇందుకు నిదర్శనం. కొత్త ఫోన్‌ను అందరికంటే ముందు సొంతం చేసుకోవాలనే ఆత్రుతతో వచ్చిన వినియోగదారులు, టెక్ ప్రియుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగి, అది కాస్తా తోపులాటకు దారితీసింది.
ఈ గొడవకు సంబంధించిన వీడియో ఒకటి వార్తా సంస్థల ద్వారా బయటకు వచ్చింది. ఇందులో వందలాది మంది స్టోర్ బయట కిక్కిరిసిపోయి ఉండటం, ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఓ ఎర్ర చొక్కా వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది బలవంతంగా పక్కకు లాక్కెళ్లగా, అతను వారిపైనే దాడికి ప్రయత్నించాడు. మరో వ్యక్తిని కూడా సాయుధ గార్డులు గుంపు నుంచి బయటకు తీసి పంపించివేశారు. ఈ గందరగోళం జరుగుతున్నంత సేపూ సెక్యూరిటీ సిబ్బంది చేతిలో లాఠీ పట్టుకుని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు.
భద్రతా వైఫల్యం కారణంగానే ఈ గందరగోళం జరిగిందని కొందరు కొనుగోలుదారులు ఆరోపించారు. అహ్మదాబాద్ నుంచి వచ్చిన మోహన్ యాదవ్ అనే వ్యక్తి మాట్లాడుతూ తాను ఉదయం 5 గంటల నుంచే క్యూలో నిల్చున్నానని, కానీ చాలా మంది క్యూ లైన్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారని తెలిపారు. "సెక్యూరిటీ సిబ్బంది బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్లే వెనుక ఉన్నవారికి ఫోన్ కొనే అవకాశం దక్కడం లేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు.
ముంబైలోనే కాకుండా, ఢిల్లీ, బెంగళూరులోని యాపిల్ స్టోర్ల వద్ద కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఢిల్లీలోని సాకేత్ సెలెక్ట్ సిటీవాక్ మాల్ వద్ద అయితే కొందరు రాత్రంతా వేచి ఉండి, ఉదయాన్నే స్టోర్‌లో అడుగుపెట్టారు.
సెప్టెంబర్ 9న యాపిల్ తన ఐఫోన్ 17 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్‌తో పాటు టాప్ మోడల్స్ అయిన ఐఫోన్ 17 ప్రో, ప్రో మ్యాక్స్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటి అమ్మకాలు నేటి నుంచి భారత్‌లో ప్రారంభమయ్యాయి.