Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 3.36 కోట్ల బంగారం పట్టివేత
- 3.38 కిలోల బంగారాన్ని పట్టుకున్న డీఆర్ఐ అధికారులు
- ఐరన్ బాక్సులో బంగారం దాచి తరలిస్తున్న వైనం
- ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న అధికారులు
హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు విమానాశ్రయంలో 3.38 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐరన్ బాక్సులో బంగారాన్ని దాచి తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ. 3.36 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ బంగారాన్ని దుబాయ్ నుంచి తీసుకువచ్చినట్లు అనుమానిస్తున్నారు. బంగారం తరలింపునకు సంబంధించి సరైన ధృవపత్రాలు లేవని అధికారులు స్పష్టం చేశారు.