Sumathi Valavu: దారి మలుపులో దెయ్యం .. ఓటీటీలో మలయాళ హారర్ థ్రిల్లర్!

Sumathi Valavu Movie Update
  • మలయాళంలో రూపొందిన 'సుమతి వలవు'
  • యథార్థ సంఘటన ఆధారంగా అల్లిన కథ 
  • 25 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన సినిమా
  • జీ 5 చేతికి ఓటీటీ హక్కులు 
  • ఈ నెల 26వ తేదీ నుంచి అందుబాటులోకి  

మలయాళం నుంచి హారర్ కామెడీ జోనర్లో ఒక సినిమా ఓటీటీకి రావడానికి రెడీ అవుతోంది .. ఆ సినిమా పేరే 'సుమతి వలవు'. అంటే 'సుమతి మలుపు' అని అర్థం. విష్ణు శశి శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన థియేటర్లకు వచ్చింది. అక్కడి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'జీ 5'లో స్ట్రీమింగ్ కావడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 26వ తేదీ నుంచి మలయాళంతో పాటు తెలుగులోను అందుబాటులోకి రానుంది.    

కేరళ - తిరువనంతపురం సమీపంలోని ఒక రోడ్డు మలుపును 'సుమతి వలవు' అనే పిలుస్తారు. 1950లలో ఒక రాత్రివేళ సుమతి అనే ఒక యువతి ఆ ప్రదేశంలో హత్య చేయబడింది. ఆమె దెయ్యంగా మారిపోయి అక్కడే తిరుగుతోందని చుట్టుపక్కల గ్రామాలవారు నమ్ముతూ ఉంటారు. ఆ ప్రదేశంలో తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉండటమే అందుకు కారణం. ఆ సంఘటన ఆధారంగానే ఈ సినిమాను రూపొందించారు.    

అర్జున్ అశోకన్ .. గోకుల్ సురేశ్ .. సైజు కురుప్ .. బాలు వర్గీస్ .. మాళవిక మనోజ్ ప్రధానమైన పాత్రలను పోషించారు. కథ అంతా కూడా దారి మలుపులోని దెయ్యం చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమాకి రంజిన్ రాజ్ అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది. మలయాళంలో 25 కోట్ల వరకూ వసూలు చేసిన ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. 

Sumathi Valavu
Sumathi Valavu movie
Malayalam horror thriller
OTT release
Zee5
Arjun Ashokan
Gokul Suresh
Saiju Kurup
Balu Varghese
Malavika Manoj

More Telugu News