Sub Registrar Office Nizamabad: 36 నెలలుగా అద్దె చెల్లించలేదని.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం

Sub Registrar Office Locked Due to Unpaid Rent in Nizamabad
  • నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఘటన
  • 36 నెలలుగా బకాయి ఉన్నప్పటికీ ఒక్క నెలా చెల్లించలేదని యజమాని ఆవేదన
  • అయోమయానికి గురైన స్లాట్లు బుక్ చేసుకున్న వారు
నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో గురువారం ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి అద్దె చెల్లించని కారణంగా తాళం వేశారు. కార్యాలయానికి 36 నెలలుగా అద్దె బకాయి ఉన్నప్పటికీ, ఒక్క నెల అద్దె కూడా చెల్లించలేదని భవన యజమాని ఆరోపిస్తున్నారు. గత మూడేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో యజమాని కార్యాలయానికి తాళం వేశారు.

నెలకు రూ. 74,000 చొప్పున అద్దె చెల్లించాల్సి ఉందని సబ్ రిజిస్ట్రార్ సాయినాథ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రిజిస్ట్రేషన్ కోసం స్లాట్లు బుక్ చేసుకున్నవారు ఈ సంఘటనతో అయోమయానికి గురయ్యారు.
Sub Registrar Office Nizamabad
Nizamabad
Sub Registrar Office
Rent Issue
Sai Nath
Bodhan
Telangana

More Telugu News