: మహీంద్రా థార్ లో వచ్చిన బ్లింకిట్ డెలివరీ ఏజెంట్.. వీడియో ఇదిగో!
- డెలివరీ ఏజెంట్ కారును చూసి షాకయ్యానన్న కస్టమర్
- బ్లింకిట్ లో జీతాలు మరీ ఇంత ఎక్కువిస్తున్నారా..అంటూ ఆశ్చర్యం
- థార్ ధరలను మహీంద్రా కంపెనీ మరీ ఇంత తగ్గించేసిందా అంటూ ప్రశ్న
ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టిన సరుకులను డెలివరీ చేసేందుకు సదరు ఏజెంట్ బైక్ పైనో, సైకిల్ పైనో వచ్చి ఇచ్చి వెళ్లడం సాధారణం.. కానీ బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ మాత్రం ఏకంగా మహీంద్రా థార్ లో వచ్చి సరుకులు ఇచ్చి వెళ్లిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే వివరాలు తెలియరాలేదు. అయితే, ఇన్ స్టాలో వైరల్ గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.
దివ్యాగ్రూవెజ్ అనే యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. తాను బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టిన సరుకులను డెలివరీ చేయడానికి సదరు ఏజెంట్ ఖరీదైన థార్ లో వచ్చాడని పేర్కొన్నారు. డెలివరీ ఏజెంట్లు థార్ కారును మెయిన్ టెయిన్ చేసే స్థాయిలో బ్లింకిట్ జీతాలు ఇస్తోందా.. లేక ఈ మధ్య మహీంద్రా కంపెనీ కార్ల ధరలను ఈ స్థాయికి తగ్గించిందా? అంటూ తన వీడియోకు క్యాప్షన్ జోడించారు.
ఇక ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. బహుశా ఆ ఏజెంట్ తన థార్ కు నెలనెలా ఈఎంఐ కట్టడానికి బ్లింకిట్ లో పనిచేస్తున్నాడేమోనని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. బ్లింకిట్ ప్రీమియం వెర్షన్ అంటూ ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా.. కొంతమంది సరదా కోసం ఇలా చేస్తుంటారని మరొక నెటిజన్ కామెంట్ పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.