iOS 26: ఐఓఎస్ 26 అప్ డేట్‌పై యూజర్ల అసంతృప్తి

iOS 26 Update Disappoints Users with Battery Issues
  • బ్యాటరీ వేగంగా తగ్గుతోందని, ఫోన్ వేడెక్కుతోందంటున్న ఐఓఎస్ 26 యూజర్లు
  • యూజర్ల వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్
  • ఇది తాత్కాలిక సమస్య మాత్రమేనన్న యాపిల్  
యాపిల్ సంస్థ తాజాగా విడుదల చేసిన ఐఓఎస్ 26 అప్‌డేట్ ఐఫోన్ వినియోగదారుల్లో అసంతృప్తిని కలిగిస్తోంది. జూన్‌లో జరిగిన డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ప్రకటించిన ఈ నూతన వెర్షన్‌ను ఇటీవల అధికారికంగా అందుబాటులోకి తెచ్చారు. అయితే, అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేసిన అనేక మంది వినియోగదారులు తమ ఐఫోన్‌ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బ్యాటరీ వేగంగా తగ్గిపోవడం, ఫోన్ వేడెక్కడం వంటి సమస్యలను పలువురు వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. "ఐఓఎస్ 26 అప్‌డేట్ నా ఫోన్‌ను ఇటుకలా మార్చేసింది," అంటూ ఓ వినియోగదారుడు ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. "ఒక్క గంటలో బ్యాటరీ 21 శాతం తగ్గిపోవడం ఏమిటి?" అని మరో వినియోగదారుడు ప్రశ్నించారు. మరికొందరు వినియోగదారులు అప్‌డేట్ తర్వాత తమ ఫోన్ బ్యాటరీ హెల్త్ ఒక్కసారిగా 80 శాతానికి పడిపోయిందని చెబుతున్నారు.

ఇలాంటి సమస్యలు గత అప్‌డేట్‌ల సమయంలోనూ కనిపించినప్పటికీ, ఈసారి వినియోగదారుల్లో అసహనం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. దీనిపై యాపిల్ స్పందిస్తూ ఇది తాత్కాలిక సమస్య మాత్రమేనని స్పష్టం చేసింది.

"ఐఓఎస్ మేజర్ అప్‌డేట్ అనంతరం, ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో డేటా ఇండెక్సింగ్, ఫైళ్ల డౌన్‌లోడ్, యాప్‌ల అప్‌డేట్ వంటి ప్రక్రియలు జరుగుతాయి. ఇవి కొద్దిసేపు బ్యాటరీపై ప్రభావం చూపవచ్చు. కానీ ఇది తాత్కాలికమే," అని యాపిల్ తన సపోర్ట్ పేజీలో పేర్కొంది. 
iOS 26
Apple iOS 26
iOS 26 update
iPhone battery drain
iPhone overheating
Apple iPhone issues
iPhone update problems
iPhone battery health
Apple support

More Telugu News