Sandeep Kumar Jha: సిరిసిల్లలో ప్రోటోకాల్ వివాదం: కలెక్టర్ ఆలస్యం... జెండా ఎగరేసిన ప్రభుత్వ విప్

Sircilla Protocol Controversy Collector Late Flag Hoisted by Government Whip
  • ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ఆలస్యంగా వచ్చిన సిరిసిల్ల కలెక్టర్
  • కలెక్టర్ రాక ఆలస్యం కావడంతో ఎగరేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
  • మరోసారి వివాదంలో చిక్కుకున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. జిల్లాలో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో ఆయన వ్యవహరించిన తీరు ప్రోటోకాల్ ఉల్లంఘనగా మారడం చర్చనీయాంశమైంది. నిర్ణీత సమయానికి కలెక్టర్ హాజరు కాకపోవడంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించడం గమనార్హం.

సిరిసిల్లలో ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా వందనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. అయితే, జిల్లా ప్రథమ పౌరుడైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాత్రం సమయానికి వేడుకలకు చేరుకోలేదు. ఆయన కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు కొంతసేపు వేచి చూశారు.

సమయం మించిపోతుండటంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలెక్టర్ లేకుండానే జాతీయ జెండాను ఎగరవేసి వందనం సమర్పించారు. ప్రభుత్వ కార్యక్రమాలలో ఉన్నతాధికారులు సమయపాలన పాటించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Sandeep Kumar Jha
Rajanna Sircilla
Adi Srinivas
Telangana
Public Administration Day
Flag Hoisting

More Telugu News