Nara Lokesh: నేడు మోదీ పుట్టినరోజు... లండన్ ఇస్కాన్ మందిరంలో నారా లోకేశ్ ప్రార్థనలు

Nara Lokesh prays at London ISKCON temple on Modis birthday
  • ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు
  • లండన్‌లోని ఇస్కాన్ ఆలయంలో ప్రార్థనలు చేసిన నారా లోకేశ్
  • మోదీ దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్ష
  • ఆయన నాయకత్వంలోనే వికసిత భారత్ సాధ్యమన్న లోకేశ్
  • దేశానికి మోదీ దార్శనిక నాయకత్వం అవసరమని వ్యాఖ్య
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ లండన్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నేడు లండన్‌లోని ప్రఖ్యాత ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించి, ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, దేశానికి ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వం మరిన్ని ఏళ్లపాటు అందాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. "మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినం సందర్భంగా లండన్ ఇస్కాన్ ఆలయంలో ప్రార్థనలతో ఈ రోజును ప్రారంభించాను. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, దేశానికి ఆయన నాయకత్వం కొనసాగాలని కోరుకున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

ప్రధాని మోదీ మార్గనిర్దేశంలో 'వికసిత భారత్' లక్ష్యాన్ని దేశం తప్పకుండా సాధిస్తుందని నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. మన గొప్ప దేశానికి ఆయన నాయకత్వం ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తన లండన్ పర్యటనలో ఉన్న నారా లోకేశ్, ప్రధాని పుట్టినరోజున ఈ విధంగా ప్రత్యేక ప్రార్థనలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Nara Lokesh
Narendra Modi
Modi birthday
London ISKCON temple
Nara Lokesh prayers
Vikshit Bharat
Indian Prime Minister
AP Minister
Lokesh London visit
Modi health

More Telugu News