: మారుతి కొత్త కారుకు విపరీతమైన డిమాండ్

  • మారుతీ సుజుకీ విడుదల చేసిన తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌వీ విక్టోరిస్ 
  • రోజు వెయ్యి చొప్పున బుకింగ్స్ 
  • ఇప్పటి వరకు పది వేల బుకింగ్స్ పూర్తయ్యాయన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బెనర్జీ 
  • సెప్టెంబర్ 22 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని వెల్లడి
భారతదేశంలో ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న మారుతీ సుజుకీ త్వరలో మార్కెట్‌లో విడుదల చేయనున్న తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి కస్టమర్ల నుండి విపరీతమైన డిమాండ్ నెలకొంది. మారుతీ సుజుకీ సరికొత్త ఎస్‌యూవీ విక్టోరిస్‌ను ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం ధర రూ.10.5 లక్షల నుంచి రూ.19.99 లక్షల వరకు ఉండనుంది.
 
ఈ కారు హైబ్రిడ్, ఫోర్ వీల్ డ్రైవ్, స్మార్ట్ ఫీచర్లు, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఆధునిక సాంకేతికతలతో రూపొందించబడింది. కంపెనీ తాజా ప్రకటన ప్రకారం.. ఇది 21 వేరియంట్లలో వినియోగదారులకు లభించనుంది.
 
రోజు 1,000 చొప్పున బుకింగ్స్

బుకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి రోజుకు 1,000 యూనిట్లు చొప్పున అమ్ముడయ్యాయి. ఇప్పటి వరకు 10,000 బుకింగ్స్ పూర్తి అయినట్లు మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారుల నుంచి వచ్చిన ఈ స్పందన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
 
సెప్టెంబర్ 22 నుంచి డెలివరీలు ప్రారంభం
 
సెప్టెంబర్ 22 నుంచి ఈ ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ మార్కెట్‌‌లో అగ్రగామిగా నిలవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వివరించారు. 
 
2025 ఆర్ధిక సంవత్సరంలో మిడ్ సైడ్ ఎస్ యూవీలు 10 లక్షలు అమ్ముడవగా, 1.94 లక్షల యూనిట్లతో హ్యూందాయ్ మోటార్ ఇండియా క్రెటా అగ్రగామిగా ఉంది. 

More Telugu News