KTR: తెలంగాణలో అసమర్థ పాలన కొనసాగుతోంది: కేటీఆర్ విమర్శలు

KTR Criticizes Inefficient Governance in Telangana
  • నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురు వ్యక్తులు
  • మూడు రోజులు గడుస్తున్నా వెలికితీయకపోవడంపై ఆగ్రహం
  • ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఘటనలో మృతదేహాలను ఇప్పటికీ గుర్తించలేదని విమర్శ
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి మృతదేహాలను మూడు రోజులు గడుస్తున్నా వెలికితీయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలిన ఘటనలో ఆరుగురి మృతదేహాలను ఇప్పటికీ గుర్తించలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు. కనీసం తమ ఆప్తులను చివరి చూపు కూడా చూసుకోలేని ఆ బాధిత కుటుంబాల ఆవేదన, గుండెకోత మానవత్వం లేని కాంగ్రెస్‌కు వినిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. నాలాల్లో బలి అయిన ముగ్గురి మృతదేహాలను కూడా గుర్తించకపోతే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని కేటీఆర్ హెచ్చరించారు.
KTR
K Taraka Rama Rao
Telangana
Telangana Government
Inefficient Governance
Congress

More Telugu News