Tejashwi Yadav: రూ.200 మోసపోయానంటూ మహిళ ఫిర్యాదు.. తేజస్వీ యాదవ్ పై ఎఫ్ఐఆర్

Tejashwi Yadav Faces FIR After Woman Alleges Rs 200 Fraud
––
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ పై చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఓ విచిత్రమైన కేసు నమోదైంది. గుడియా
దేవి అనే మహిళ తననుండి రూ.200 మోసపూరితంగా తీసుకున్నారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు తేజస్వీ యాదవ్ ‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో రాజ్యసభ ఎంపీ సంజయ్‌ యాదవ్‌ సహా పలువురు సీనియర్ నేతల పేర్లను కూడా చేర్చడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘మై-బెహన్‌ యోజన’ కింద మహిళలకు రూ.2,500 హామీ పథకం కోసం దరఖాస్తు చేయడానికి తన వద్ద నుంచి రూ.200 తీసుకున్నారని సింగ్వారాకు చెందిన గుడియా దేవి అనే మహిళ ఆరోపించారు.

అంతేకాకుండా, పలువురు మహిళల నుంచి మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, బ్యాంకు ఖాతా వివరాలు కూడా తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే తేజస్వీ యాదవ్, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ యాదవ్‌ సహా పలువురిపై ఆమె ఫిర్యాదు చేశారు. గుడియా దేవి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై తేజస్వీ యాదవ్ కానీ, సంజయ్ యాదవ్ కానీ ఇంతవరకు స్పందించలేదు.
Tejashwi Yadav
Bihar
RJD
FIR
Rs 200 fraud
Gudiya Devi
Sanjay Yadav
My-Behan Yojana
Bihar Politics
Singhwara

More Telugu News