Donald Trump: వెనెజులా స్మగ్లర్ల బోటును పేల్చేసిన అమెరికా నేవీ.. వీడియో ఇదిగో!
- ముగ్గురు స్మగ్లర్లనూ మట్టుబెట్టామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- అమెరికన్లను విషపూరితం చేస్తున్నారని ఆగ్రహం
- నార్కోటెర్రరిస్టుల పట్ల కఠినంగా ఉంటామని వెల్లడి
వెనెజులాకు చెందిన మరో స్మగ్లర్ల బోటునూ సముద్రంలోనే పేల్చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెల్లడించారు. సముద్రంలో చిన్న బోటును నేవీ పేల్చేసిన వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’ లో షేర్ చేశారు. వెనెజులా నుంచి మత్తుమందులను అమెరికాలోకి చేరవేస్తున్నారని, ఈ నార్కోటెర్రరిస్టులు అమెరికన్లను విషపూరితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపట్ల కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ జలాల్లో కనిపించిన ఈ బోటు స్మగ్లర్లదేనని నిర్ధారించుకున్న తర్వాతే తమ నేవీ దాడి చేసిందని ట్రంప్ వివరించారు. అందులో పెద్ద మొత్తంలో మత్తుమందులను అమెరికాలోకి తీసుకొచ్చేందుకు స్మగ్లర్లు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ బోటును పేల్చేయడంతో అందులో ఉన్న ముగ్గురు వెనెజులా స్మగ్లర్లు చనిపోయారని ఆయన వివరించారు. కాగా, వారం రోజుల క్రితం ఇదేవిధంగా ఓ స్పీడ్ బోటును సముద్రంలోనే పేల్చేశామని, ఆ ఘటనలో పదకొండు మంది స్మగ్లర్లు చనిపోయారని ట్రంప్ తెలిపారు.