Gutta Jwala: పసిపిల్లలకు అమృతాన్ని పంచుతున్న జ్వాలా గుత్తా!
- వీలున్న ప్రతి తల్లి బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్‌లకు సపోర్ట్ చేయాలన్న జ్వాలా గుత్తా
- ఇప్పటి వరకు 30 లీటర్ల తల్లిపాలను దానం చేసిన జ్వాలా
- సోషల్ మీడియాలో జ్వాలాకు నెటిజన్ల ప్రశంసల వర్షం
ఆకలేస్తే 'అమ్మా అన్నం పెట్టు' అని పిల్లలు అడుగుతారు. మరి నవజాత శిశువులు తమ ఆకలిని ఏడుపు ద్వారా వ్యక్తీకరిస్తారు. అయితే, పాలు ఉత్పత్తి కాని తల్లులు ఆ శిశువుల ఆకలిని చూసి చలించిపోతారు. ఇక తల్లి లేని శిశువుల సంగతీ అంతే! ఇటువంటి చిన్నారుల ఆకలిని అర్థం చేసుకొని, తల్లి ప్రేమను విస్తరించిన ఓ నిజమైన ఛాంపియన్‌గా నిలిచారు బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా.
ఇప్పటివరకు దాదాపు 30 లీటర్ల తల్లిపాలను దానం చేసిన జ్వాలా, తల్లిపాలను అందుకోలేని చిన్నారుల ఆకలిని తీర్చే గొప్ప పని చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం పాపకు జన్మనిచ్చిన ఆమె, తన బిడ్డకు అవసరమైనన్ని పాలను ఇచ్చిన తరువాత మిగిలిన వాటిని దాతృత్వంగా పంచుతున్నారు. ఈ ఉదారతపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘‘రియల్ ఛాంపియన్’’ అంటూ నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు.
బాడ్మింటన్ క్రీడాకారిణిగా జ్వాలా గుత్తా మనందరికీ సురిచితమే. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పతకాల పంట పండించిన ఆమె.. సినీ రంగంలోనూ అడుగుపెట్టి ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో నటించింది. ఆమె సామాజిక స్పృహను చూపిస్తూ ధూమపాన వ్యతిరేక ప్రచారాలు, మూగజీవాల సంరక్షణ వంటి కార్యక్రమాల్లో పాల్గొని తన మంచి మనసును చాటుకుంది.
2021లో తమిళ నటుడు విష్ణు విశాల్‌ను ప్రేమ వివాహం చేసుకున్న జ్వాలా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో పాపకు జన్మనిచ్చారు. తమ నాలుగో వివాహ వార్షికోత్సవం రోజునే మహాలక్ష్మి పుట్టిందంటూ ఈ శుభవార్తను ఆనందంగా సోషల్ మీడియాలో జ్వాలా దంపతులు పంచుకుంటూ మురిసిపోయారు.
కాగా, ప్రస్తుతం తాను నడుపుతోన్న ‘జ్వాలా గుత్తా అకాడమీ’ ద్వారా యువతకి బ్యాడ్మింటన్ శిక్షణనిస్తూనే, తన తల్లితనాన్నీ ఆస్వాదిస్తోంది జ్వాలా. అయితే ఆమె మంచి మనసు అక్కడితో ఆగలేదు. ఎన్‌ఐసీయూల్లో చికిత్స పొందుతున్న పసిపిల్లలు, తల్లిపాలు అందని బుజ్జాయిల ఆకలిని తీర్చేందుకు ఇప్పటివరకు సుమారు 30 లీటర్ల తల్లిపాలను దానం చేసింది.
ఈ సందర్భంగా జ్వాలా సోషల్ మీడియాలో ఒక స్ఫూర్తిదాయక సందేశాన్ని పంచుకుంది. "చనుబాలు పసిపిల్లలకు అమృతంతో సమానం. అది ప్రాణాలు కాపాడుతుంది. వీలున్న ప్రతి తల్లి బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్‌లకు సపోర్ట్ చేయాలి. ప్రస్తుతం నేనూ ఇదే చేస్తున్నాను" అని చెప్పిన జ్వాలా, తన మంచి మనసుతో నెటిజన్లను ఎంతో మంత్రముగ్ధులను చేసింది. ‘‘మీరు సిసలైన ఛాంపియన్, ఎంతో మంది చిన్నారుల ఆకలిని తీర్చుతున్నారు’’ అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక తల్లైన జ్వాలా, తన చిన్నారిని నానీలకే కాదు, స్వయంగా తానే పెంచుకుంటున్నానని, అదే తల్లితనంలోని మాధుర్యాన్ని ఆస్వాదించే మార్గమని చెబుతోంది. ‘‘నానీని నియమించుకోలేదు. నా పాపకు డైపర్లు మార్చడం, పాలివ్వడం నేను చేస్తుంటే అమ్మతనం ఎంత అద్భుతమో అర్థమవుతోంది’’ అంటూ చెప్పిన ఆమె, తన కూతురిని 18 ఏళ్ల వరకూ మొబైల్, సోషల్ మీడియా దూరంగా ఉంచాలనుకుంటున్నానని వెల్లడించింది. ‘‘నాకు నా తల్లిదండ్రులు స్వతంత్రత ఎలా జీవించాలో నేర్పారు. అలాగే నా కూతురిని కూడా ఓ దృఢమైన మహిళగా తీర్చిదిద్దాలనుకుంటున్నా’’ అని జ్వాలా చెప్పిన మాటలు తల్లులందరికీ స్పూర్తిగా నిలుస్తున్నాయి.
ఓ అథ్లెట్‌గానే కాదు, ఓ తల్లిగా, ఓ మహిళగా, ఓ మానవతావాది పాత్రలోనూ జ్వాలా గుత్తా అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఐవీఎఫ్ ద్వారా పాపకు జన్మనిచ్చిన తమ ప్రయాణాన్ని కూడా ఓపికగా పంచుకున్న జ్వాలా, విష్ణు దంపతులు, ఈ ప్రక్రియలో ఎదురైన సవాళ్లు, ఆశలు, విజయాలను తెలియజేశారు. ఆమిర్ ఖాన్ సలహాతో ముంబయిలో చికిత్స తీసుకుని ఐవీఎఫ్ ద్వారా పాప పుట్టిందని చెప్పిన వారు, ఇది తమకు జీవితంలో వెలకట్టలేని అనుభూతి అని తెలిపారు.