Pakistan Cricket Team: మా జట్టుతో ఆడొద్దు ప్లీజ్.. టీమిండియాకు పాక్ అభిమానుల విజ్ఞప్తి

Pakistan Fans Request India to Boycott Match After Asia Cup Loss
  • తర్వాతి మ్యాచ్ ను భారత్ బాయ్ కాట్ చేయాలని అభ్యర్థన
  • అప్పుడే తమ జట్టు ఫైనల్స్ కు వెళుతుందంటూ వ్యంగ్యం
  • సొంత జట్టుపై తీవ్రంగా మండిపడుతున్న పాక్ అభిమానులు
ఆసియా కప్ టోర్నీలో భాగంగా నిన్నటి మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు ఘోర పరాజయం పాలైన విషయం విదితమే. దీనిపై పాక్ అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. కనీస పోరాటం కూడా చేయకుండానే వారి జట్టు ఓటమిని అంగీకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులు దీనిపై వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. తమ జట్టుతో తర్వాత జరగబోయే మ్యాచ్ ను బాయ్ కాట్ చేయాలని టీమిండియాకు విజ్ఞప్తి చేస్తున్నారు.

పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా పాకిస్థాన్ జట్టుతో మ్యాచ్ ను బాయ్ కాట్ చేయాలని మొన్నటి వరకూ భారత క్రికెట్ అభిమానులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఇదే డిమాండ్ పాకిస్థాన్ అభిమానుల నుంచి రావడం విశేషం. లీగ్ దశలో భారత్ తో ఓటమి నేపథ్యంలో పాక్ తన చివరి మ్యాచ్‌లో గెలిస్తే సూపర్ 4 లోకి ప్రవేశిస్తుంది.

అప్పుడు మరోమారు భారత్ తో మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. టీమిండియాతో తలపడి తమ జట్టు గెలవలేదని తేల్చేసుకున్న పాక్ అభిమానులు.. ఒకవేళ తమ జట్టు సూపర్ 4 లోకి అడుగుపెట్టి టీమిండియాతో ఆడాల్సి వస్తే ఆ మ్యాచ్ ను బాయ్ కాట్ చేయాలని కోరుతున్నారు. అప్పుడే తమ జట్టు ఫైనల్స్ కు వెళుతుందని వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.
Pakistan Cricket Team
Asia Cup 2024
India vs Pakistan
Pakistan Cricket
Cricket Match Boycott
Rohit Sharma
Indian Cricket Team
Pakistan Fans

More Telugu News