Jagapathi Babu: ఆ టైమ్ లో నాకు ధైర్యం సరిపోలేదు మీనా: జగపతిబాబు

Meena Interview
  • 'జయమ్ము నిశ్చయమ్మురా' వేదికపై మీనా
  • ఆమె లైఫ్ లోని విషాదం గురించి ప్రస్తావన
  • ఫ్రెండ్స్ వలన తేరుకున్నానన్న మీనా
  • కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పట్ల అసహనం 

 జీ తెలుగులో ఇప్పుడు 'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షో దూసుకుపోతోంది. జగపతిబాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షోకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. జగపతిబాబు వంటి ముక్కుసూటి మనిషిని .. దాపరికం తెలియని వ్యక్తిని వ్యాఖ్యాతగా ఎంచుకోవడం, ఈ షోను డిజైన్ చేసిన తీరు మంచి మార్కులు కొట్టేసింది. ఈ షోలో మీనాతో ఆయన మాట్లాడిన మాటలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.

జగపతిబాబు - మీనా కొన్ని సినిమాలలో కలిసి నటించారు. అందువలన వాళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ చనువుతోనే ఆయన ఆమెతో మాట్లాడారు. మీనా భర్తను కోల్పోవడం గురించి జగపతిబాబు ప్రస్తావిస్తూ, ఆ సమయంలో తాను రాలేకపోయినందుకు సారీ చెప్పారు. ఆమె ముఖం చూడటానికి తనకి ధైర్యం సరిపోలేదనీ, అందువల్లనే తాను రాలేకపోయానని అన్నారు.

అందుకు మీనా స్పందిస్తూ .. "తాను చాలా దుఃఖంలో ఉన్న సమయంలో తన స్నేహితులు అండగా నిలిచారనీ, బాధపడుతూ ఇంట్లో కూర్చోవద్దని చెప్పి బయట ప్రపంచంలోకి తీసుకుని వచ్చారని చెప్పారు. అయితే కొన్ని యూట్యూబ్ చానల్స్ వారు తనకి రెండో పెళ్లి అంటూ తమకి తోచింది రాసేయడం చాలా బాధ కలిగించిందనీ, అంత అసహ్యంగా ఎలా రాయగలిగారని అనిపించిందని అన్నారు. కొంతమంది అదే పనిలో ఉంటారనీ, అలాంటి మాటలను పట్టించుకోవలసిన అవసరం లేదని జగపతిబాబు చెప్పారు.
Jagapathi Babu
Meena
Jayammu Nischayammu Raa
Zee Telugu
Talk Show
Telugu Cinema
Celebrity Interview
Second Marriage Rumors
Tollywood
Grief and Loss

More Telugu News