Nara Devaansh: "శభాష్ ఛాంప్"... మనవడు దేవాన్ష్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు

Nara Devaansh wins World Book of Records award Chandrababu congratulates
  • దేవాన్ష్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు 2025 ప్రదానం
  • లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ హాల్‌లో పురస్కారం అందజేత
  • అత్యంత వేగంగా 175 చెక్‌మేట్ పజిల్స్ సాల్వ్ చేసి రికార్డు
  • దేవాన్ష్ సాధించిన విజయంపై సీఎం చంద్రబాబు హర్షం
  • ఇది పట్టుదల, గురువుల మార్గదర్శకత్వంతో సాధ్యమైందని ప్రశంస
ఏపీ మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ లండన్ వేదికగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. చెస్ క్రీడలో అత్యద్భుతమైన ప్రతిభ కనబరిచి 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2025' పురస్కారాన్ని అందుకున్నాడు. లండన్‌లోని చారిత్రక వెస్ట్‌మిన్‌స్టర్ హాల్‌లో ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన హర్షాన్ని వ్యక్తం చేస్తూ మనవడు దేవాన్ష్‌ను అభినందించారు.

చెస్ గేమ్‌లో అత్యంత వేగంగా చెక్‌మేట్ పజిల్స్‌ను ఛేదించిన వ్యక్తిగా దేవాన్ష్ ఈ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. మొత్తం 175 పజిల్స్‌ను వేగంగా పూర్తి చేసి ఈ ఘనత సాధించాడు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు, "మా దేవాన్ష్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు 2025 అందుకోవడం గర్వంగా ఉంది" అని తెలిపారు.

నెలల తరబడి చూపిన పట్టుదల, గురువుల మార్గదర్శకత్వం వల్లే ఈ విజయం సాధ్యమైందని చంద్రబాబు పేర్కొన్నారు. దేవాన్ష్ సాధించిన ఈ రికార్డు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన దేవాన్ష్‌ను 'శభాష్ ఛాంప్' అంటూ ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికపై దేవాన్ష్ ప్రతిభకు గుర్తింపు లభించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Nara Devaansh
Devaansh Nara
World Book of Records
Chess Champion
Nara Lokesh
Chandrababu Naidu
Andhra Pradesh
Chess Puzzles
Westminster Hall
London

More Telugu News