Harivansh Singh: తిరుపతి సదస్సులో ఎన్టీఆర్ ను గుర్తుచేసుకున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్

Rajya Sabha Deputy Chairman Remembers NTR at Tirupati Conference
  • మహిళా సాధికారతకు ఆయన ఎంతో కృషి చేశారన్న హరివంశ్‌ సింగ్‌
  • అభివృద్ధి చెందిన దేశాలలో మహిళలకు ప్రాధాన్యం
  • ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబులపై ప్రశంసల జల్లు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత నటుడు ఎన్టీఆర్ మహిళా సాధికారతకు ఎంతో కృషి చేశారని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహించిన తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సులో హరివంశ్ మాట్లాడుతూ.. సభా వేదికగా ఎన్టీఆర్ కు ప్రణామాలు తెలిపారు. మహిళల సాధికారత కోసం ప్రధాని నరేంద్ర మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. బిహార్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, జన్‌ధన్‌ యోజనలో సగానికిపైగా ఖాతాలు మహిళలవేనని చెప్పారు.

అభివృద్ధి చెందిన ఎన్నో దేశాలు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాయని హరివంశ్ వివరించారు. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను టెక్నాలజీ హబ్‌గా తీర్చదిద్దారంటూ సీఎం చంద్రబాబును హరివంశ్ ప్రశంసించారు. ప్రస్తుతం శ్రీసిటీలో సగానికిపైగా మహిళలు ఉద్యోగాలు చేస్తుండడం అభినందనీయమని అన్నారు. దేశంలోనే తొలిసారిగా నైపుణ్య గణనను ఏపీలో చేపట్టారని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ తెలిపారు.
Harivansh Singh
NTR
Narendra Modi
Tirupati
Women Empowerment
Chandrababu Naidu
Andhra Pradesh
Sricity
Jan Dhan Yojana
National Conference

More Telugu News