Rithika Nayak: 'మిరాయ్'లో మెరిసిన పాలరాతి శిల్పం!
- నిన్న విడుదలైన 'మిరాయ్'
- తొలి ఆటతోనే దక్కిన హిట్ టాక్
- అందంగా మెరిసిన రితిక నాయక్
- అభిమానులుగా చేరిపోతున్న కుర్రాళ్లు
- మరిన్ని ఛాన్సులు రావడం ఖాయమే
వెండితెరపై పూల తోటలు .. మంచుకొండలు .. వెన్నెల్లో తడిసే వనాలు కనిపించకపోయినా ఆడియన్స్ పెద్దగా బోర్ ఫీలవ్వరు. పాలనురగలతో దూకే జలపాతాలు .. గలగలమని ప్రవహించే సెలయేళ్లు పలకరించకపోయినా పట్టించుకోరు. తెరపై విందుభోజనాల వడ్డన జరుగుతున్నా లైట్ తీసుకుంటారు. అందమైన హీరోయిన్ ను తప్ప, వాళ్ల చూపులు మరి దేని కోసమూ వెదకవు. తెరపై అందమైన హీరోయిన్ చూపించే ప్రభావం ఆ రేంజ్ లో ఉంటుంది మరి.
ఈ మధ్య కాలంలో ఎక్కువమంది కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టిన బ్యూటీగా భాగ్యశ్రీ బోర్సే కనిపిస్తుంది. ఆ తరువాత అంత ఆకర్షణీయంగా అనిపించిన నాయిక ఎవరైనా ఉన్నారా అంటే, 'రితిక నాయక్' అనే చెప్పాలి. 'మిరాయ్' సినిమా చూసిన కుర్రాళ్లంతా తమ హృదయాలను ఆమెకి అప్పగించేసి వచ్చేశారు. పాలరాతి శిల్పం మాదిరిగా ఉన్న ఈ అమ్మాయి ఎవరబ్బా అనే చర్చలు చేసుకుంటూ కనిపించారు. తాను ఇంతకుముందు 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమాలో చేసిందనే విషయం కొంతమందికి తట్టింది.
ఎలాంటి అలంకరణలు లేకపోయినా చూపు తిప్పుకోనీయనిదే అసలైన అందం అంటూ ఉంటారు. ఈ సినిమాలో ఆమె పాత్ర అలాగే కనిపిస్తుంది. భుజాన ఒక సంచీ తగిలించుకుని తిరిగే సాధువు ఆమె. కానీ తెరపై ఆమె కనిపించిన ప్రతిసారి, ఆ పక్కన ఎవరున్నారనేది ఆడియన్స్ పట్టించుకోలేదు. వెన్నెల్లోని చందమామకు వెన్నతో కనుముక్కు తీర్చినట్టుగా కనిపించడం గురించే మాట్లాడుకుంటున్నారు. చూస్తుంటే ఈ బ్యూటీని మరిన్ని ఛాన్సులు పలకరించే సూచనలు కనిపిస్తున్నాయి.