Sailajanath: మాజీ మంత్రి, వైసీపీ నేత శైలజానాథ్‌కి అస్వస్థత
- శింగనమల వైసీపీ సమన్వయకర్త శైలజానాథ్ కు వైరల్ ఫీవర్
- హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి
- జ్వరంతోనే 'అన్నదాత పోరు' కార్యక్రమంలో పాల్గొన్న శైలజానాథ్!
మాజీ మంత్రి, అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ వైసీపీ పార్టీ సమన్వయకర్త సాకే శైలజానాథ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. అనారోగ్యానికి గురైన శైలజానాథ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆయన త్వరగా కోలుకోవాలని వైసీపీ నేతలు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఆకాంక్షిస్తున్నారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతూనే శైలజానాథ్... ఇటీవల వైసీపీ నిర్వహించిన 'అన్నదాత పోరు' కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం.
ఆయన త్వరగా కోలుకోవాలని వైసీపీ నేతలు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఆకాంక్షిస్తున్నారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతూనే శైలజానాథ్... ఇటీవల వైసీపీ నిర్వహించిన 'అన్నదాత పోరు' కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం.