మాజీ మంత్రి, వైసీపీ నేత శైలజానాథ్‌కి అస్వస్థత

మాజీ మంత్రి, అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ వైసీపీ పార్టీ సమన్వయకర్త సాకే శైలజానాథ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. అనారోగ్యానికి గురైన శైలజానాథ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఆయన త్వరగా కోలుకోవాలని వైసీపీ నేతలు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఆకాంక్షిస్తున్నారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతూనే శైలజానాథ్... ఇటీవల వైసీపీ నిర్వహించిన 'అన్నదాత పోరు' కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం.


More Telugu News