ట్రంప్ ప్రయత్నాలు విఫలం.. చర్చలు ఆగిపోయాయన్న రష్యా
- రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలకు తాత్కాలిక విరామం
- చర్చలు ఆగిపోయినట్లు అధికారికంగా ప్రకటించిన క్రెమ్లిన్
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దౌత్య ప్రయత్నాలకు ఎదురుదెబ్బ
- దాడులు ఆపకుండా దూకుడుగా వ్యవహరిస్తున్న రష్యా
ఈ విషయంపై క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, "చర్చల ప్రక్రియలో తక్షణమే ఫలితాలు వస్తాయని ఆశించలేం. ప్రస్తుతానికి చర్చలకు విరామం ఇచ్చామనే చెప్పాలి" అని స్పష్టం చేశారు. సంప్రదింపులు కొనసాగుతున్నాయని, తమ రాయబారులు చర్చలు జరిపే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతానికైతే ఇవి తాత్కాలికంగా నిలిచిపోయాయని చెప్పగలమని పేర్కొన్నారు. అయినప్పటికీ శాంతి చర్చలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కానీ యూరప్ దేశాలు వీటిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు.