Manchu Manoj: అన్నకు థాంక్స్ చెప్పిన మంచు మనోజ్

Manchu Manoj Thanks Brother Manchu Vishnu for Mirai Wishes
  • ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మిరాయ్' చిత్రం
  • విడుదల రోజే హిట్ టాక్ సొంతం
  • విషెస్ చెప్పిన మంచు విష్ణు
  • అన్నయ్యకు కృతజ్ఞతలు తెలిపిన మనోజ్
  • కీలక పాత్రలో కనిపించిన మంచు మనోజ్
  • తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ 
ఈరోజు (సెప్టెంబరు 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మిరాయ్' చిత్రం మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. యంగ్ హీరో తేజ సజ్జ కథానాయకుడిగా, 'ఈగల్' ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. భారీ విజువల్స్, ఆసక్తికరమైన కథనంతో సినిమా ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రంలో మంచు మనోజ్ 'బ్లాక్‌స్వోర్డ్' అనే శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించారు. ఆయనతో పాటు రితికా నాయక్, శ్రియా శరన్, జగపతి బాబు వంటి ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, గౌర హరి సంగీతం అందించారు.

కాగా, మిరాయ్ విడుదల సందర్భంగా ప్రముఖ హీరో మంచు విష్ణు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా విజయం అందుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. దీనిపై నటుడు మంచు మనోజ్ స్పందించారు. తన అన్నకు సోషల్ మీడియా వేదికగా రిప్లయ్ ఇచ్చారు. థాంక్యూ సో మచ్ అన్నా... టీమ్ మిరాయ్ అలియాస్ బ్లాక్ స్వోర్డ్ నుంచి ధన్యవాదాలు అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు. 
Manchu Manoj
Mirai Movie
Teja Sajja
Karthik Ghattamaneni
Manchu Vishnu
Telugu Cinema
People Media Factory
Black Sword
Ritika Nayak
Shriya Saran

More Telugu News