Samyuktha Menon: నేను కావాలని గ్యాప్ తీసుకోలేదు: సంయుక్త మీనన్

Samyuktha Menon Clarifies Gap Was Unintentional
  • వరుస విజయాల తర్వాత కనిపించకుండా పోయిన సంయుక్త మీనన్
  • తాను గ్యాప్ తీసుకోలేదని, సినిమాలు ఆలస్యమయ్యాయని వెల్లడి
  • ‘అఖండ 2’ చిత్రంతో మొదలుకానున్న సెకండ్ ఇన్నింగ్స్
‘భీమ్లానాయక్’, ‘బింబిసార’, ‘సార్’, ‘విరూపాక్ష’ వంటి వరుస విజయాలతో టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న మలయాళీ నటి సంయుక్త మీనన్. కొంతకాలంగా వెండితెరపై కనిపించకపోవడంపై తాజాగా ఆమె స్పష్టత ఇచ్చారు. తాను కావాలని విరామం తీసుకోలేదని, తాను అంగీకరించిన చిత్రాలు పూర్తికావడంలో ఆలస్యం జరగడం వల్లే ఈ గ్యాప్ వచ్చిందని ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అయితే, ఈ చిన్న విరామాన్ని భర్తీ చేసేలా ఇప్పుడు ఆమె భారీ చిత్రాల లైనప్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ ఏడాది డిసెంబర్ నుంచి సంయుక్త మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. బాలకృష్ణ కథానాయకుడిగా రాబోతున్న ‘అఖండ 2’ చిత్రంతో ఆమె రీ-ఎంట్రీ గ్రాండ్‌గా ఉండబోతోంది. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని బాలకృష్ణ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత సంక్రాంతి బరిలో ‘నారీ నారీ నడుమ మురారీ’ అనే రొమాంటిక్ చిత్రంతో సందడి చేయనున్నారు. ఇవే కాకుండా, యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న పౌరాణిక చిత్రం ‘స్వయంభు’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న ‘హైందవ’ చిత్రాల్లోనూ ఆమె కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో ఓ సినిమాలో కూడా ఆమె నటించనున్నట్లు సమాచారం.

ఒక్క టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషల్లోనూ సంయుక్త తన హవాను కొనసాగించనున్నారు. బాలీవుడ్‌లో ‘మహారాజ్ఞి: క్వీన్ ఆఫ్ క్వీన్స్’ చిత్రంతో అరంగేట్రం చేస్తున్నారు. అలాగే, మలయాళంలో చాలాకాలంగా నిర్మాణంలో ఉన్న మోహన్‌లాల్-జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లోని ‘రామ్’ చిత్రం కూడా వచ్చే ఏడాదే విడుదల కానుంది. ఇక లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రాబోతున్న ‘బెంజ్’ అనే మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులోనూ ఆమె భాగమయ్యారు. ఈ సినిమాలన్నీ 2026 నాటికి విడుదల కానుండటంతో, రాబోయే రోజుల్లో సంయుక్త కెరీర్ మరో స్థాయిలో ఉండనుందని స్పష్టమవుతోంది. 
Samyuktha Menon
Akhanda 2
Nari Nari Naduma Murari
Bimbisara
Sir
Virupaksha
Telugu cinema
Tollywood
হায়ন্দব
Swayambhu

More Telugu News