మ్యాన్ హోల్‌లో పడిపోయిన చిన్నారి ఘటనపై హైడ్రా కమిషనర్ రియాక్షన్
- ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టినట్లు వెల్లడి
- సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని వివరణ
- మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇన్‌ఛార్జి బాధ్యుడన్న రంగనాథ్
మ్యాన్ హోల్ లో పడిన చిన్నారి..
యాకుత్‌పుర పరిధి రెయిన్‌బజార్ డివిజన్ లోని మౌలాకా ఛిల్లా బస్తీలో గురువారం ఆరేళ్ల చిన్నారి మ్యాన్ హోల్ లో పడిపోయింది. బుధవారం మధ్యాహ్నం పూడికతీత పనుల కోసం మ్యాన్ హోల్ తెరిచిన బల్దియా సిబ్బంది.. ఆ తర్వాత మూసేయకుండానే వెళ్లిపోయారని స్థానిక బల్దియా సహాయ ఇంజినీరు నరేశ్ తెలిపారు. గురువారం ఉదయం స్కూలుకు వెళుతున్న ఓ చిన్నారి ఈ మ్యాన్ హోల్ లో పడిపోయింది. ఆమె తల్లి, స్థానికులు చిన్నారిని గుంతలో నుంచి పైకి లాగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.