KTR: నడుస్తున్నది సర్కారా? సర్కసా?: కేటీఆర్ ధ్వజం

KTR Slams Revanth Reddys Governance After Manhole Incident
  • యాకుత్‌పురా మ్యాన్‌హోల్ ఘటనపై కేటీఆర్ ఆగ్రహం
  • ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం వల్లే ప్రమాదాలు అని ఆరోపణ
  • జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటున్నాయని వెల్లడి
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లోని యాకుత్‌పురాలో తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో చిన్నారి పడిపోయిన ఘటనను ప్రస్తావిస్తూ, ఇది ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక సర్కస్ నడుపుతున్నారా? అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.

యాకుత్‌పురాలో జరిగిన ఘటనలో అదృష్టవశాత్తూ పాప ప్రాణాలతో బయటపడిందని, లేదంటే ఆ కుటుంబానికి తీరని శోకం మిగిలేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత తప్పును సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వ శాఖలు, ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం దారుణమని అన్నారు. జీహెచ్ఎంసీ వారు ఇది హైడ్రా తప్పంటే, వారు అది జలమండలి పొరపాటని చేతులు దులుపుకున్నారని తెలిపారు. అసలు తమకు సంబంధమే లేదని జలమండలి ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు.

మున్సిపల్ శాఖలోని మూడు కీలక విభాగాల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడిందని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం కాసుల వేటపైనే దృష్టి పెట్టారని, పరిపాలనను గాలికొదిలేశారని విమర్శించారు. శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల నగర ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR
BRS
Revanth Reddy
Telangana Government
GHMC
Hyderabad
Yakutpura
Manhole accident
Telangana Politics

More Telugu News