కేటీఆర్‌కు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారం

  • ప్రతిష్ఠాత్మక 'గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025'కు ఎంపిక
  • పర్యావరణ పరిరక్షణ కృషి చేశారంటూ పురస్కారం
  • అమెరికాలోని న్యూయార్క్‌లో జరగనున్న అవార్డు ప్రదానోత్సవం
  • ఈ నెల 24న 'ఎన్‌వైసీ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్'లో పురస్కార ప్రదానం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. పర్యావరణ పరిరక్షణకు కేటీఆర్ కృషి చేశారంటూ, ఆయనను 'గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025'కు ఎంపిక చేశారు.

ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఘనంగా జరగనుంది. ఈ నెల సెప్టెంబర్ 24వ తేదీన అక్కడ నిర్వహించనున్న 9వ 'ఎన్‌వైసీ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్' వేదికగా కేటీఆర్‌కు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. పర్యావరణ పరిరక్షణ, హరిత విధానాల అమలులో కేటీఆర్ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు చొరవ చూపారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

ఈ పురస్కారం కేటీఆర్‌కు వ్యక్తిగతంగానే కాకుండా, తెలంగాణలో పర్యావరణ పరిరక్షణకు జరిగిన ప్రయత్నాలకు లభించిన అంతర్జాతీయ గుర్తింపుగా పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


More Telugu News