Samantha: ఎవరో వచ్చి నా స్థానం లాక్కుంటారని భయపడ్డా: సమంత

Samantha Reveals Fear of Losing Her Place in Industry
  • విజయంపై తన ఆలోచనలు మారాయన్న సమంత
  • గతంలో నంబర్లు, లెక్కలతోనే బతికానని వెల్లడి
  • ఇప్పుడు ఆ ఆలోచనా ధోరణి నుంచి పూర్తిగా బయటకు వచ్చానన్న సామ్
ఒకప్పుడు వరుస సినిమాలు, బ్లాక్‌బస్టర్‌ హిట్లు, టాప్‌ జాబితాలో స్థానం... వీటినే విజయానికి కొలమానంగా భావించానని అగ్ర కథానాయిక సమంత అన్నారు. తన స్థానాన్ని ఇంకెవరైనా భర్తీ చేస్తారేమోనన్న భయంతో, తన ఆత్మగౌరవాన్ని పూర్తిగా నంబర్లతోనే ముడిపెట్టి చూశానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాతగా 'మా బంగారు తల్లి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్‌, వ్యక్తిగత ఆలోచనలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

గతంలో తన ఆలోచనా విధానం గురించి వివరిస్తూ, "గ్యాప్ లేకుండా సినిమాలు చేయడమే సక్సెస్ అని బలంగా నమ్మేదాన్ని. ఏడాదికి ఐదు సినిమాలు విడుదలైన రోజులు కూడా ఉన్నాయి. దాన్నే పెద్ద విజయంగా భావించి అపోహ పడ్డాను. ఎప్పుడూ టాప్‌ 10 నటీనటుల జాబితాలో ఉండాలని, భారీ బ్లాక్‌బస్టర్లు అందుకోవాలని లెక్కలు వేసుకునేదాన్ని" అని సమంత గుర్తుచేసుకున్నారు.

అయితే, ఇప్పుడు తన ఆలోచనల్లో పూర్తి మార్పు వచ్చిందని సమంత స్పష్టం చేశారు. "గత రెండేళ్లుగా నేను సినిమాలు చేయలేదు. టాప్‌ 10 జాబితాలో కూడా లేను. నా దగ్గర రూ. 1,000 కోట్ల సినిమాలు లేకపోయినా, ఉన్నంతలో చాలా సంతోషంగా జీవిస్తున్నాను. ఒకప్పుడు నా స్థానాన్ని ఎవరైనా భర్తీ చేస్తారేమోనని నిరంతరం భయపడేదాన్ని. నా ఆత్మగౌరవం మొత్తం ఆ నంబర్ల మీదే ఆధారపడి ఉందని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఆ ఆలోచనా ధోరణి నుంచి పూర్తిగా బయటకు వచ్చేశాను" అని ఆమె తెలిపారు.

ప్రస్తుతం నటనకు కొంత విరామం ఇచ్చిన సమంత, నిర్మాతగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. త్వరలోనే ఆమె నిర్మించిన 'మా బంగారు తల్లి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు 

Samantha
Samantha Ruth Prabhu
Ma Bangaru Talli
actress
South Indian cinema
Tollywood
movie producer
success
top actress
cinema

More Telugu News