RBI: నాలుగున్నర ఎకరాలకు 3.5 వేల కోట్లు.. ఎక్కడంటే!
- ముంబైలో ఖరీదైన స్థలం కొనుగోలు చేసిన ఆర్బీఐ
- స్టాంప్ డ్యూటీకే రూ.208 కోట్లు
- మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి భూమి స్వాధీనం
- ఈ ఏడాది ఇదే రికార్డు ధర అంటున్న రియల్ ఎస్టేట్ వర్గాలు
ముంబైలోని నాలుగున్నర ఎకరాల భూమి కొనుగోలుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కళ్లు చెదిరే మొత్తం వెచ్చించింది. ఏకంగా రూ.3,472 కోట్లు చెల్లించి 4.6 ఎకరాలను సొంతం చేసుకుంది. నగరంలో ముఖ్యమైన వ్యాపార కూడలి అయిన నారీమన్ పాయింట్ ప్రాంతంలో మంత్రాలయ, బాంబే హైకోర్టు, పలు కార్పొరేట్ హెడ్ క్వార్టర్ల మధ్యలో ఉన్న ఈ భూమిని ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి స్వాధీనం చేసుకుంది. ఈ ఏడాది భూమి కొనుగోళ్లలో ఇదే రికార్డు ధర అని ముంబై రియల్ ఎస్టేట్ వర్గాలు వెల్లడించాయి. ఈ డీల్ కోసం ఆర్బీఐ చెల్లించిన స్టాంప్ డ్యూటీ రూ.208 కోట్లు కావడం గమనార్హం.
వేలం వేసేందుకు ప్రయత్నం..
ముంబై మెట్రో కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ల్యాండ్ ను వేలం వేయాలని భావించింది. గతేడాది ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేసింది. అయితే, ఆర్బీఐ తన హెడ్ క్వార్టర్స్ ను విస్తరించుకోవాలని భావించి ఈ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించింది. దీంతో మెట్రో కార్పొరేషన్ ఈ భూమిని వేలం వేసే ప్రయత్నాన్ని విరమించుకుని ఆర్బీఐకి విక్రయించింది.