: బైడెన్‌పై కమలా హారిస్ సంచలన ఆరోపణలు.. ఆయన అహంకారం వల్లే ఓడామంటూ నిప్పులు
- బైడెన్ రెండోసారి పోటీ చేయడం అవివేకమన్న కమలా హారిస్
- అది ఆయన వ్యక్తిగత అహంకారంతో తీసుకున్న నిర్ణయమని ఆరోపణ
- ‘107 డేస్’ పేరుతో రాసిన తన ఆత్మకథలో సంచలన విషయాల వెల్లడి
- వైట్ హౌస్ సిబ్బంది తనను కావాలనే పక్కనపెట్టారని ఆవేదన
- ఆయన వయసు రీత్యా తడబడ్డారని, దీనిపై కుట్రలేమీ లేవని స్పష్టీకరణ
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పై మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సంచలన ఆరోపణలు చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఆయన మళ్లీ పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయం అత్యంత బాధ్యతారహితమైనదని, అది దేశ సేవ కన్నా ఆయన వ్యక్తిగత అహంకారం, ఆశయం వల్ల తీసుకున్న నిర్ణయమని తీవ్రంగా విమర్శించారు. తన ఆత్మకథ ‘107 డేస్’లో ఆమె వెల్లడించిన ఈ విషయాలు ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ పుస్తకంలోని కొన్ని కీలక భాగాలను ‘ది అట్లాంటిక్’ పత్రిక ప్రచురించింది.
ఒకప్పుడు బైడెన్‌కు అత్యంత విధేయురాలిగా ఉన్న కమలా హారిస్ ఇప్పుడు ఆయనపై ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. "అది జో, జిల్ దంపతుల నిర్ణయం అని మేమంతా ఒక మంత్రంలా పఠించాం. మేమంతా హిప్నటైజ్ అయినట్టుగా ప్రవర్తించాం. వెనక్కి తిరిగి చూసుకుంటే అది ఆయన చేసిన అతి పెద్ద అవివేకమనిపిస్తోంది" అని కమలా హారిస్ తన పుస్తకంలో పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి అహంకారానికి, ఆశయానికి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సింది కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
తాను ఉపాధ్యక్షురాలిగా ఉన్నందున పోటీ నుంచి తప్పుకోమని బైడెన్‌కు సలహా ఇవ్వలేని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నానని కమల తెలిపారు. "ఒకవేళ నేను ఆ సలహా ఇచ్చి ఉంటే అది నా స్వార్థం కోసమే అని, అధికార దాహంతోనే అలా చెప్పానని ఆయన భావించేవారు. నా సలహాను ఒక విషపూరితమైన నమ్మకద్రోహంగా చూసే ప్రమాదం ఉంది" అని ఆమె రాశారు.
అంతేకాకుండా, వైట్ హౌస్‌లోని బైడెన్ సిబ్బంది తనను నిరంతరం పక్కనపెట్టారని, తన ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని కమలా హారిస్ ఆరోపించారు. "ఆమెకు పేరు వస్తే, ఆయనకు కీర్తి తగ్గుతుందనే ధోరణితో వారు ఆలోచించేవారు. నా విజయం అధ్యక్షుడి విజయంగా వారు చూడలేకపోయారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బైడెన్ ఆరోగ్య సమస్యలను కప్పిపుచ్చడానికి ఎలాంటి కుట్ర జరగలేదని, అయితే 81 ఏళ్ల వయసులో ఆయన అలసిపోయినప్పుడు శారీరకంగా, మాటల్లో తడబడ్డారని ఆమె స్పష్టం చేశారు.
2024 జులైలో జరిగిన డిబేట్‌లో పేలవమైన ప్రదర్శన తర్వాత బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ బరిలోకి దిగారు. కేవలం 107 రోజుల ప్రచార సమయంతో ఆమె రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓటమి పాలయ్యారు.