Manchu Manoj: విలన్‌గా నటించాలన్న ఆలోచన లేదు కానీ... మంచు మనోజ్

Manchu Manoj on Playing a Villain Role in Mirai
  • ఎక్స్ వేదికగా అభిమానులతో మంచు మనోజ్ చిట్ చాట్
  • మిరాయ్ కథ విన్న తర్వాత విలన్ పాత్రపై తన అభిప్రాయాన్ని మార్చుకున్నానన్న మనోజ్
  • రేపు శుక్రవారం విడుదల కానున్న మిరాయ్
విలన్‌గా నటించాలనే ఆలోచన తనకు లేకున్నా, దర్శకుడు కథ చెప్పిన తర్వాత ఆ పాత్రపై తన అభిప్రాయం మార్చుకున్నానని నటుడు మంచు మనోజ్ అన్నారు. మిరాయ్ మూవీ అవుట్‌పుట్ చూసిన తర్వాత గర్వంగా భావించానని పేర్కొన్నారు.

నటుడు మంచు మనోజ్ కొన్నాళ్ల విరామం తర్వాత వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఇటీవల ‘భైరవం’ సినిమాతో తిరిగి వచ్చిన ఆయన, ఇప్పుడు ‘మిరాయ్’ అనే చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించనున్నారు. అయితే, ఇందులో బ్లాక్ స్వాడ్ అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మనోజ్ నటించడం విశేషం.

తేజ సజ్జా హీరోగా, కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సై-ఫై ఫాంటసీ చిత్రం ఈ శుక్రవారం (సెప్టెంబర్ 13) విడుదల కానుంది. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది.

‘ఎక్స్’ వేదికగా మనోజ్ చిట్‌చాట్:

సినిమా విడుదలను పురస్కరించుకుని ఎక్స్ వేదికగా మనోజ్ అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఆయన అభిమానులు అడిగిన ప్రశ్నలకు చమత్కారంగా, స్నేహపూర్వకంగా స్పందించారు.

‘మిరాయ్’లో మీ బెస్ట్ సీన్ ఏది? అని ఒక అభిమాని అడగగా, మనోజ్ స్పందిస్తూ.. ఒక్కటే చెప్పడం కష్టం, ప్రతి ఫ్రేమ్‌ అద్భుతం అని పేర్కొన్నారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని స్పష్టం చేశారు. అలాగే, ఓ అభిమాని సూరత్ నుంచి ప్రశ్న అడగడంపై హిందీపై ఆసక్తికర వ్యాఖ్య చేశారు. విద్యార్థి దశలో తాను హిందీ పరీక్షలు ఫెయిల్ అయినా, ‘మిరాయ్’లో పాత్రకు సాధ్యమైనంత మేరకు హిందీ డబ్బింగ్ చెప్పానని అన్నారు. తన డ్రీమ్ రోల్ ధుర్యోధనుడు అని మరో అభిమాని వేసిన ప్రశ్నకు మనోజ్ సమాధానంగా చెప్పారు. 
Manchu Manoj
Mirai movie
Teja Sajja
Karthik Ghattamaneni
Ritika Nayak
Telugu cinema
Bhairavam movie
Black Swad role
Sci-fi fantasy film
Tollywood

More Telugu News