Nepal violence: నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం ఢిల్లీలో సహాయక కేంద్రం

Nepal Violence Telangana Helpline Opens in Delhi
  • తెలంగాణ భవన్‌లో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం
  • ముగ్గురు అధికారుల బృందానికి బాధ్యతల అప్పగింత
  • అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రజలకు సూచన
నేపాల్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో పలువురు తెలంగాణవాసులు అక్కడ చిక్కుకుపోవడంతో, వారికి సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ సహాయ కేంద్రం బాధ్యతలను ముగ్గురు అధికారుల బృందానికి అప్పగించింది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం నేపాల్‌లో తెలంగాణ పౌరులెవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వం తెలిపింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఖాట్మాండ్‌లోని భారత రాయబార కార్యాలయంతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.

నేపాల్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ పౌరులు, వారి కుటుంబ సభ్యులు అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.

నేపాల్‌లో ఎవరైనా తెలంగాణ వాసులు చిక్కుకుంటే వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులను ఈ కింది నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చు. వందన, రెసిడెంట్ కమిషనర్, ప్రైవేట్ సెక్రటరీ అండ్ లైజన్ హెడ్ +91 9871999044, రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ +91 9643723157, హెచ్ చక్రవర్తి, ప్రజా సంబంధాల అధికారి +91 9949351270.
Nepal violence
Telangana
Telangana Bhavan
Indians in Nepal
Nepal
Delhi
Stranded Indians

More Telugu News