Pawan Kalyan: నూతన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan Congratulates New Vice President CP Radhakrishnan
  • శుభాకాంక్షలు తెలియజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
  • ఆయన సుదీర్ఘ అనుభవం, విశిష్ట నాయకత్వ లక్షణాలు ఉపరాష్ట్రపతి పదవికి మరింత గౌరవాన్ని తీసుకువస్తాయనన పవన్ కల్యాణ్ 
  • రాజ్యసభలో సార్థకమైన, నిర్మాణాత్మక చర్చలకు ఆయన ప్రోత్సాహిస్తారని ఆశాభావం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ అభినందనలు తెలియజేశారు.
 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ..“భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ జీకి నా హృదయపూర్వక అభినందనలు. ఆయన సుదీర్ఘ అనుభవం, విశిష్ట నాయకత్వ లక్షణాలు ఉపరాష్ట్రపతి పదవికి మరింత గౌరవాన్ని తీసుకువస్తాయి. రాజ్యసభలో సార్థకమైన, నిర్మాణాత్మక చర్చలకు ఆయన ప్రోత్సాహం కలిగి, ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరిచే దిశగా ఇది తోడ్పడుతుంది,” అని పేర్కొన్నారు. 
Pawan Kalyan
CP Radhakrishnan
Vice President Election
Janasena
Andhra Pradesh
NDA
Indian Politics
Rajya Sabha

More Telugu News