Bhanupriya: భానుప్రియను మరచిపోలేకపోతున్న ఫ్యాన్స్!

Bhanupriya Special
  • ఐదు భాషల్లో నటించిన భానుప్రియ 
  • ఆకర్షణీయమైన కళ్లు ఆమె ప్రత్యేకత
  • క్లాసికల్ డాన్సర్ గా మరింత గుర్తింపు 
  • భర్త మరణం తరువాత వచ్చిన మార్పు 
  • జ్ఞాపకశక్తి తగ్గిందన్న భానుప్రియ  

తెలుగు తెరకి అందమైన కాటుక కళ్లను పరిచయం చేసిన కథానాయిక భానుప్రియ. వెండితెర దిశగా అడుగులు వేసిన మంగభాను .. భానుప్రియగా మారడం వెనుక ఎంతో కృషి ఉంది. అప్పట్లో కాస్తరంగు తక్కువగా ఉన్నవారికి అవకాశాలు అంతంత మాత్రంగా ఉండేవి. అయినా సావిత్రి .. వాణిశ్రీ సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని భానుప్రియ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అలా భానుప్రియ కెమెరా ముందుకు వచ్చారు. 

విశాలమైన కళ్లు .. చలాకీ చూపులు .. చక్కని పలువరుస .. ఆకర్షణీయమైన నవ్వు .. ఆకట్టుకునే వాయిస్ భానుప్రియ ప్రత్యేకతలుగా అప్పటి విశ్లేషకులు రాసుకొచ్చారు. అలాంటి భానుప్రియ వరుస అవకాశాలను అందుకోవడానికీ .. స్టార్ డమ్ ను దక్కించుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. నటన పరంగా .. గ్లామర్ పరంగా .. డాన్సుల పరంగా తనకి గట్టి పోటీగా ఉన్న విజయశాంతి - రాధలను తట్టుకుని నిలబడటానికి భానుప్రియ మరింత కష్టపడవలసి వచ్చింది. అందుకు ఆమె నేర్చుకున్న క్లాసికల్ డాన్స్ ఎంతో ఉపయోగపడింది. 

ఐదు భాషల్లో అనేక చిత్రాలలో నటించిన భానుప్రియ, ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగాను కొన్ని సినిమాలలో నటించారు. ఆ తరువాత ఆమె ఎక్కడా కనిపించలేదు. వైవాహిక జీవితంలోని ఒడిదుడుకులు .. భర్త మరణం ఆమెను కుంగదీశాయని చెప్పుకున్నారు. జ్ఞాపకశక్తి తగ్గడం వలన తనకి డైలాగ్స్ గుర్తుండటం లేదనీ, అందువలన సినిమాలు మానేశానని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది జరిగి చాలాకాలమే అవుతుంది. ఆ తరువాత ఆమె గురించి ఏమీ తెలియకుండా పోయింది. దాంతో ఆమెను గురించిన సమాచారం ఏదైనా లభిస్తుందేమోనని అభిమానులు సెర్చ్ చేస్తూనే ఉన్నారు.

Bhanupriya
Telugu actress
Indian actress
classical dance
actress Bhanupriya
Tollywood actress
Vijayshanti
Radha
Telugu cinema
South Indian cinema

More Telugu News