Chandrababu Naidu: తిరుపతి-షిర్డీ రైలుపై సీఎం చంద్రబాబు ప్రతిపాదన... కేంద్రం ఓకే

Chandrababu Naidus Tirupati Shirdi train proposal approved by central government
  • రెగ్యులర్ ట్రైన్‌గా తిరుపతి - సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్
  • సీఎం చంద్రబాబు ప్రతిపాదన మేరకు నిర్ణయం తీసుకున్నామన్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
  • ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి - షిర్డీ మధ్య భక్తులకు ప్రయాణం సులభతరం అవుతుందన్న రైల్వే శాఖ  
తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీ వరకు తాత్కాలిక ప్రాతిపదికన నడుస్తున్న ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 07637/07638)కు రైల్వే శాఖ శాశ్వత హోదా కల్పించింది. ఈ మేరకు రైలును క్రమబద్ధీకరించి రెగ్యులర్ రైలుగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలియజేశారు.

  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 2న రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు.

ఈ రైలు రేణిగుంట, ధర్మవరం, రాయచూరు, షోలాపూర్, దౌండ్ స్టేషన్ల మీదుగా తిరుపతి నుంచి షిర్డీ వరకు ప్రయాణిస్తుంది. రైలును వారానికి ఒకటి లేదా రెండుసార్లు నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి.

ఈ రైలు ద్వారా తిరుపతి, షిర్డీ పుణ్యక్షేత్రాల మధ్య భక్తులకు ప్రయాణం సులభతరం అవుతుంది. విశ్వసనీయమైన, అందుబాటు ధరల్లో రవాణా సౌకర్యం లభిస్తుందని రైల్వే శాఖ పేర్కొంది. 
Chandrababu Naidu
Tirupati Shirdi train
Indian Railways
Ashwini Vaishnaw
Tirupati
Shirdi
Special Express
Pilgrimage
Andhra Pradesh
Railway ministry

More Telugu News