Hyderabad Police: హైదరాబాద్‌లో భారీగా... రద్దయిన రూ.500, రూ. 1000 నోట్ల పట్టివేత
- నారాయణగూడలో పట్టుకున్న ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు
- కెనరా బ్యాంకు వద్ద ఇద్దరు, వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద ఇద్దరి అరెస్టు
- మూడు బ్యాగుల్లో రూ. 2 కోట్ల విలువ చేసే రద్దయిన నోట్లు
హైదరాబాద్ నగరంలో భారీగా రద్దయిన పెద్ద నోట్లు పట్టుబడ్డాయి. తొమ్మిదేళ్ల క్రితం రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణగూడ శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న కెనరా బ్యాంకు వద్ద ఇద్దరిని, వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద ఇద్దరిని ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద ఉన్న మూడు బ్యాగుల్లో తనిఖీలు చేయగా రూ.2 కోట్ల విలువ చేసే రద్దయిన నోట్లు కనిపించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ నిమిత్తం నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
వారి వద్ద ఉన్న మూడు బ్యాగుల్లో తనిఖీలు చేయగా రూ.2 కోట్ల విలువ చేసే రద్దయిన నోట్లు కనిపించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ నిమిత్తం నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.