Nandamuri Balakrishna: స్టాక్ ఎక్స్చేంజ్ లో బెల్ మోగించిన బాలకృష్ణ... తొలి సౌత్ హీరోగా అరుదైన ఘనత

Nandamuri Balakrishna Rings Stock Exchange Bell First South Actor
  • ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ను సందర్శించిన బాలకృష్ణ
  • ట్రేడింగ్ ప్రారంభ సూచికగా బెల్ మోగించిన నందమూరి హీరో
  • ఈ గౌరవం పొందిన తొలి దక్షిణ భారత నటుడిగా రికార్డు
  • బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పనులపై ముంబై పర్యటన
  • ఇది తెలుగు ప్రజల విజయమని బాలకృష్ణ వ్యాఖ్య
  • ఈ క్షణం తనకు మరపురానిదని పేర్కొన్న బాలయ్య
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో ట్రేడింగ్ ప్రారంభానికి సూచికగా మోగించే గంటను ఆయన మోగించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు. ఈ గౌరవం దక్కించుకున్న మొట్టమొదటి దక్షిణ భారత నటుడిగా ఆయన ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు. 

"ముంబై స్టాక్ ఎక్స్చేంజ్‌లో చిరస్మరణీయ, మరపురాని ఘట్టం. ఈ రోజు నేను మా బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రతినిధులతో ముంబై పర్యటనలో భాగంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE India)ని సందర్శించడం జరిగింది. ఆ సందర్భంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అధికారులు చూపిన ఆత్మీయత, ఇచ్చిన గౌరవం నా హృదయాన్ని తాకింది. ప్రత్యేక ఆహ్వానం ఇచ్చి, నాకు స్టాక్ ఎక్స్చేంజ్ బెల్ మోగించే అవకాశాన్ని ఇచ్చారు. దక్షిణ భారతీయ నటుడిగా, హీరోగా ఈ వేదికపై బెల్ మోగించిన మొదటి వ్యక్తిగా నిలవడం నాకు గర్వకారణం మాత్రమే కాదు... ఇది నా తెలుగు ప్రజల ప్రేమ, ఆదరణ, ఆశీర్వాదాల ప్రతిఫలమని భావిస్తున్నాను. ఈ క్షణం నాకు మరపురానిది. ఇది వ్యక్తిగత ఘనత కాదని, మనందరి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని నమ్ముతున్నాను" అంటూ బాలయ్య వినమ్రంగా స్పందించారు. 
Nandamuri Balakrishna
Balakrishna
NSE
National Stock Exchange
Mumbai Stock Exchange
Basavatarakam Cancer Hospital
South Indian Actor
Telugu Cinema
Stock Exchange Bell

More Telugu News