Srilakshmi: విషం తాగడం తప్ప మరో మార్గం లేదంది మా అమ్మ: నటి శ్రీలక్ష్మి

Sri Lakshmi Interview
  • హాస్యనటిగా శ్రీలక్ష్మికి పేరు  
  • తమ ఫాదర్ పెద్ద హీరో అని వెల్లడి 
  • నిర్మాతగా నష్టపోయారని వివరణ  
  • అనారోగ్యంతో చనిపోయారని ఆవేదన 
  • ఫ్యామిలీ కోసం సినిమాల్లోకి రావలసి వచ్చిందన్న శ్రీలక్ష్మి

తెలుగు తెరపై హాస్య నటిగా శ్రీలక్ష్మి ఒక వెలుగు వెలిగారు. అప్పట్లో జంధ్యాల సినిమాలు శ్రీలక్ష్మి లేకుండా ఉండేవి కాదు. ఆమె తరువాత ఆ స్థాయిలో హాస్యాన్ని పండించిన నటి మరొకరు లేరనే చెప్పాలి. సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన శ్రీలక్ష్మి కెరియర్లో గుర్తుపెట్టుకోదగిన పాత్రలు చాలానే కనిపిస్తాయి. అలాంటి శ్రీలక్ష్మి తాజాగా 'బిగ్ టీవీ'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన గురించిన అనేక విషయాలను గురించి ప్రసావించారు.  

"మా అమ్మానాన్నలకు మేం ఆరుగురు సంతానం. మా నాన్నగారు అమర్ నాథ్ అప్పట్లో  హీరోగా చేశారు. అయితే సినిమా నిర్మాణం వలన బాగా నష్టపోయారు. హీరోగా అవకాశాలు తగ్గిన తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా చేయలేకపోయారు ... దానికి తోడు అనారోగ్యం. కుటుంబం గడవడానికి మేం సినిమాలు చేస్తామంటే ఒప్పుకునేవారు కాదు. ఆయన చివరి రోజులలో అంగీకరించారు. 'శుభోదయం' సినిమాతో నేను హీరోయిన్ గా పరిచయం కావలసింది. ఆ సమయంలోనే నాన్న చనిపోవడం వలన ఆ ఛాన్స్ పోయింది" అని అన్నారు. 

"నాన్న చనిపోయారు .. ఏడుగురు కుటుంబ సభ్యులం బ్రతకాలి. అందరూ నా తరువాత వారే. 'నువ్వొక్క దానివి నీ జీవితాన్ని త్యాగం చేస్తే, కుటుంబం గడుస్తుంది .. అందరం బ్రతకొచ్చు. లేదంటే అందరం కలిసి తలా ఇంత విషం తాగడం తప్ప మరో మార్గం లేదు' అని మా అమ్మ నాతో అంది. అలాంటి పరిస్థితులలో ఇక నేను మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేసి నా కెరియర్ పై మాత్రమే ఫోకస్ చేయవలసి వచ్చింది" అని చెప్పారు. 

Srilakshmi
Srilakshmi actress
Telugu actress
comedian Srilakshmi
actress interview
financial struggles
family problems
Tollywood
Subhodayam movie

More Telugu News