Chiranjeevi: విడుదలకు ముందే చిరంజీవి సినిమా సంచలనం.. భారీ ధరకు ఓటీటీ రైట్స్!

Chiranjeevis Mana Shankara Varaprasad Garu Creates Sensation with OTT Rights
  • సంక్రాంతి బరిలో 'మన శంకర వరప్రసాద్ గారు'
  • ఓటీటీ హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ కొత్త చిత్రం
  • చిత్రంలో కీలక పాత్రలో విక్టరీ వెంకటేశ్ 
  • ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న షూటింగ్
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం విడుదల కాకముందే సంచలనాలు సృష్టిస్తోంది. సినిమా షూటింగ్ దశలో ఉండగానే, దాని ప్రీ-రిలీజ్ బిజినెస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరాయి. చిరంజీవి, వెంకటేశ్ కలిసి తెరపై కనిపించనుండటం, దానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనుండటంతో సినిమాకు అన్ని వైపుల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓటీటీ డీల్ మాత్రమే కాకుండా, శాటిలైట్, ఆడియో, థియేట్రికల్ హక్కులకు కూడా పెద్ద ఎత్తున పోటీ నెలకొన్నట్లు సమాచారం.

చిత్ర యూనిట్ ఈ సినిమా షూటింగ్‌ను నవంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా ముగించి, 2026 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్న ఈ సినిమా, రాబోయే రోజుల్లో మరిన్ని అప్‌డేట్స్‌తో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 
Chiranjeevi
Chiranjeevi movie
Mana Shankara Varaprasad Garu
Anil Ravipudi
Venkatesh
Amazon Prime Video
OTT rights
Telugu cinema
Shine Screens
Sankranti 2026

More Telugu News